50 ఏళ్లలో ఒక్క కేసు కూడా నమోదు కాని గ్రామం

Update: 2020-02-28 18:30 GMT
గ్రామాలంటే గొడవలు, పంచాయితీలకు ఆలవాలంగా ఉంటాయి. చిన్నవి, పెద్దవి, భూ పంచాయితీలు చాలా పెద్ద లొల్లినే గ్రామాల్లో ఉంటుంది. కానీ ఈ గ్రామం పూర్తి భిన్నం.  గడిచిన 50 ఏళ్లుగా ఆ గ్రామంలో పోలీసులు అడుగు పెట్టలేదు. 50 ఏళ్లలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.ఇదో అద్భుతమనే చెప్పాలి.

దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకొని ఉండే హర్యానా రాష్ట్రంలోని జీంద్ జిల్లా రోజ్ ఖెడా గ్రామం ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇక్కడ గ్రామంలో గొడవలే జరగవా అంటే జరుగుతాయి. కానీ వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లరు. పంచాయితీ పెద్దల ద్వారానే తమ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇలా 50 ఏళ్లలో ఒక్క పోలీస్ కేసు నమోదు కాకపోవడం విశేషం.

గ్రామంలో గొడవలు జరుగుతాయని.. అయితే పంచాయితీ పెద్దల సమక్షంలోనే సమస్యలు పరిష్కరించుకుంటామని ఆ గ్రామ సర్పంచ్ రణధీర్ సింగ్ మాట్లాడారు.  వివిధ కులాల వారు కుల పెద్దల ద్వారా సమస్యలు తీర్చుకుంటారని తెలిపారు.
Tags:    

Similar News