ఒకటి అధికారంలో ఉన్న పార్టీ. మరోటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ. తేడీ ఏమీ లేదు రెండు పార్టీలలోనూ నేతాశ్రీలు ఒకేల ఉన్నారు. అధికారంలో ఉన్నామన్న ఫీలింగ్ వైసీపీ నేతలకు ఇపుడు ఎటూ లేదు, ఇక మరోసారి టికెట్ ఏమైనా దక్కుతుందా అన్నదే వారికి ఈ టైం లో పట్టుకున్న అతి పెద్ద టెన్షన్. వైసీపీలో చూస్తే 175 అసెంబ్లీ సీట్లలోనూ ఇంచార్జిలు ఉన్నారు. అందులో ఓడిన 23 సీట్లలో వారే అంతా తాము అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
గెలిచిన చోట్ల ఎటూ ఎమ్మెల్యేలే ఆ నియోజకవర్గం ఇంచార్జులుగా పార్టీని హోల్డ్ చేస్తున్నారు. ఇదంతా సరే అనుకున్నా నిజంగా వైసీపీ ఇంచార్జిలకే టికెట్లు వస్తాయా వచ్చే ఎన్నికల్లో వారేనా మరోసారి పోటీ చేసేది అంటే అది మాత్రం అడగకూడదు అన్నట్లుగానే పార్టీలో సీన్ ఉంది. ముందు ఉన్న వారితో పని కానిద్దామన్న వైఖరిలోనే హై కమాండ్ ఉండడంతో వైసీపీలో ఇంచార్జిలకు తమకు టికెట్లు కన్ ఫర్మ్ గా వస్తాయా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితిగా ఉందిట.
దాంతో పాటు జగన్ పెడుతున్న వర్క్ షాప్స్, పార్టీ చేయిస్తున్న సర్వేలు కూడా వారికి నిద్ర పట్టకుండా చేయిస్తున్నాయని అంటున్నారు. సర్వేలలో వెనకబడిన వారికి నో టికెట్లు అని హై కమాండ్ ఎటూ చెబుతూనే ఉంది. మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి టికెట్లు స్తామని కూడా పార్టీ నుంచి కాకపోయినా బయట వెల్లువలా ప్రచారం సాగుతోంది. దాంతో ఎమ్మెల్యేలు తెగ పరేషన్ అవుతున్నారు.
ఇక గతసారి ఎమ్మెల్యే టికెట్ల కోసం ట్రై చేసిన వారు ఎటూ ఉంటారు. వారు ఇపుడు ముందుకు వచ్చి తన లక్ ని టెస్ట్ చేసుకుంటూండడంతో ఎమ్మెల్యేలకు చాప కింద నీరు చేరుతోంది అని అంటున్నారు. ఇలా ప్రస్తుతం ఉన్న పదవిని అనుభవించకుండానే వారికి నిండా చమటలు పడుతున్నాయట. ఇంకో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు అంటున్నారు.
అక్కడ కూడా చంద్రబాబునాయుడు వరసబెట్టి సమీక్షలు నిర్వహించారు. ఆయన వందకు పైగా సీట్లలో రివ్యూస్ చేసి పారేశారు. ఆయన ప్రతీ సమీక్షలోనూ అంటున్న మాట ఏంటి అంటే పనిచేయని వారికి అసలు టికెట్లు లేవు, ఇచ్చేది లేదు అని. దాంతో ప్రస్తుతం ఇంచార్జిగా ఉంటూ పార్టీ కోసం కష్టపడుతున్న వారికి కూడా నీరసం వచ్చేస్తోందిట. వారికి మరో సమస్య కూడా ఉంది.
అదేంటి అంటే జనసేనతో పొత్తు కనుక ఉంటే తమ సీటు ఉంటుందా ఊడుతుందా అన్నది. నిజానికి పొత్తులు లేకుండా టీడీపీ ఈసారి పోటీ చేయదు. అదే జనసేనతో పోటీ అంటే కచ్చితంగా పెద్ద నంబర్ లో సీట్లు పోతాయని అంటున్నారు. అలా కాపోతే మిగిలిన చిన్న పార్టీలతో పొత్తులు అంటే ఎన్నో కొన్ని సీట్లు పోవడం ఖాయం. ఎలా చూసుకున్నా తమ సీటుకు గ్యారంటీ ఉందా అంటే అధినాయకత్వమే చెప్పలేదు.
ఈ విధంగా టీడీపీ తమ్ముళ్ళు సీటు ఉంటుందా గోవిందా అవుతుందా అన్న టెన్షన్ తో నిద్ర పట్టక అవస్థలు పడుతున్నారుట. అంటే వైసీపీలో చూసుకున్నా సేమ్ సీన్ కనిపిస్తోంది. ఏకంగా సగానికి సగం మంది సిట్టింగులను లేపేసి కొత్త వారిని తెచ్చిపెట్టడానికి జగన్ చూస్తున్నారు. దాంతో ఇంచార్జిలలో గుబుల్ చెలరేగుతోంది. ఇలా అటూ ఇటూ రెండు ప్రధాన పార్టీలలోని ఇంచార్జిలు అర చేతిలో గుండె కాయ పెట్టుకుని భయం భయంగా బతుకుతున్నారనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.