ట్రంప్ క‌పుల్‌ కు మోదీ గిఫ్ట్‌ లివే!

Update: 2017-06-27 12:54 GMT
అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన భార‌త ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ... ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ - అమెరికా ఫ‌స్ట్ లేడీ మెలానియా ట్రంప్‌ కు భారీ గిఫ్టులే ప‌ట్టుకెళ్లారు. భార‌త కాల‌మానం ప్ర‌కారం నిన్న రాత్రి ట్రంప్‌ తో భేటీ అయిన మోదీ... ద్వైపాక్షిక సంబంధాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ చ‌ర్చ‌లు ముగిసిన క్ర‌మంలో మోదీ త‌న వెంట తీసుకెళ్లిన గిఫ్ట్‌ ల‌ను బ‌య‌ట‌కు తీశారు. ఆ గిఫ్ట్‌ ల‌ను చూసి అటు ట్రంప్‌ తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి మెలానియా కూడా మైమ‌ర‌చిపోయారు.

అయినా మోదీ త‌న వెంట తీసుకెళ్లి... ట్రంప్ దంప‌తుల‌కు ఇచ్చిన గిఫ్ట్‌ ల వివ‌రాల్లోకి వెళితే... అవ‌న్నీ కూడా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఉన్న చిన్న కళాకండాలేన‌ట‌. అమెరికా ప్రఖ్యాతిగాంచిన అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ శత వర్థంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం భారత్‌ లో 1965లో విడుదల చేసిన ఒరిజినల్‌ లింకన్‌ స్టాంప్‌ ను జాగ్ర‌త్త‌గా తీసుకెళ్లిన మోదీ దానిని ట్రంప్‌ కు అందించారు. ఈ బ‌హుమతికి సంబంధించి భార‌త ప్ర‌ధాన‌మంత్రిత్వ కార్యాల‌యం త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో కింది విధంగా పేర్కొంది.

‘ప్రఖ్యాతిగాంచిన అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ ను గుర్తు చేసుకుంటూ ఆయన గౌరవార్థం విడుదల చేసిన స్టాంప్ ను మోదీ... ట్రంప్‌ కు అంద‌జేశారు.  భారత జాతిపిత గాంధీ - లింకన్‌ ఆదర్శాలు ఒకేలా ఉండేవి’ అని పేర్కొంది. ఇక మెలానియాకు మోదీ అంద‌జేసిన గిఫ్ట్‌ ల విష‌యానికి వ‌స్తే... హిమాచల్‌ ప్రదేశ్‌ కు చెందిన హస్తకళాకండాలైన వెండి బ్రాస్లెట్‌ - టీ - కాంగ్రా ప్రాంతానికి చెందిన తేనే - జమ్ముకశ్మీర్ - హిమాచల్ ప్రదేశ్‌ కు చెందిన హ్యాండ్‌ వోవెన్‌ షాల్స్‌ బహుమతిగా అందించారు. ఇందుకు ప్రతిగా మోదీకి ట్రంప్‌ అమెరికా శ్వేతసౌదం టూర్‌ గైడ్‌ ను అందించారు. ఇందులో అబ్రహం లింకన్‌ బెడ్‌ రూం వివరాలు కూడా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News