ఊహించని రీతిలో ఒక ఎమ్మెల్యే పెట్టిన పోటీ ఇప్పుడు వైరల్ గా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక ప్రజాప్రతినిధి తమ వారికి ఆధునిక జీవనశైలి దిశగా అడుగులు వేయించేందుకు పెట్టిన పోటీ ఇప్పుడు ఆసక్తికర వార్తగా మారింది. వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటిగా చెప్పే జార్ఖండ్ లో ఆధునిక జీవనశైలి దిశగా ఆదివాసీలను ప్రోత్సహించటం కోసం ఒక చిత్రమైన పోటీని ఏర్పాటు చేశారు.
ఇంతకీ ఈ పోటీ ఏమిటంటే.. ముద్దులు పెట్టుకోవటం. ఈ పోటీలో పాల్గొన్నవారంతా ఆదివాసీయులే. ఆదివాసీయ జంటలు ఒకరినొకరు గాఢంగా.. అందరి ఎదుట ముద్దులు పెట్టుకోవాలి. ఇలా చేయటం ద్వారా ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుందన్నది సదరు ఎమ్మెల్యేగారి ఆలోచన అట.
జార్ఖండ్‌కు చెందిన ఎమ్మెల్యే నసైమన్ మరాండీ నిర్వహించిన ఈ ముద్దుల పోటీ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ పోటీలో మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఏ జంట ఎక్కువసేపు ముద్దు పెట్టుకుంటుందో ఆ జంటను విజేతగా ప్రకటిస్తారు. ఈ పోటీకి ఆదరణ బాగానే ఉంది. ఎక్కువ జంటలు హాజరయ్యాయి. పోటీలో పాల్గొన్న వారంతా ఆదివాసీయులే కావటం ఆసక్తికర అంశం. ఆదివాసీయుల్లో ఆధునికత పెంచే పనిలో భాగంగా ఈ పోటీని నిర్వహించినట్లుగా సదరు ఎమ్మెల్యే చెబుతున్నారు. ఎక్కువసేపు ముద్దుపెట్టుకున్న మూడు జంటలకు బహుమతులు అందజేశారు. ఆధునికత అన్నది ముద్దులు పెట్టేసుకుంటే వచ్చేస్తుందా?