వైట్ హౌస్ పై ఆటంబాంబు వేస్తే...?

Update: 2017-04-28 16:12 GMT
త‌న క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో అమెరికాను ఆటాడుకుంటున్న నార్త్ కొరియా అధినేత కిమ్‌ జాంగ్.. మరోసారి త‌న దుడుకుత‌నం చూపించారు.  గతంలో అమెరికాలోని ప్రధాన నగరం అయిన వాషింగ్టన్‌ పై అణ్వస్త్ర దాడి చేసి బూడిద కుప్పలా మార్చిసినట్లు వీడియో రూపొందించిన ఉత్తర కొరియా ప్రభుత్వం.. మరోసారి అలాంటి అస్త్రాన్నే అమెరికాపై సంధించింది. అయితే ఈసారి మాత్రం ఏకంగా వైట్‌ హౌస్‌ నే శిథిలం చేసిన‌ట్లుగా వీడియో రూపొందించారు.

వైట్‌ హౌస్‌ తోపాటు, దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు - యుద్ధనౌకలపై కూడా దాడి చేసినట్లుగా త‌యారుచేసిన‌ వీడియో ఒక‌టి గురువారం విడుదల చేశారు. 2.28 నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోలో.. ఉత్తర కొరియా సైన్యం పరేడ్‌ ను కూడా జోడించారు. అంతేకాకుండా ఆ వీడియోపై.. ఉత్తర కొరియా భాషలో ‘మా దేశం ఎంత బలమైందో, ఎంత శక్తివంతమైన ఆయుధాలున్నాయో నీకు చూపిస్తాం’ అని రాసి ఉంది.

అయితే ఇలాంటి వీడియోలను విడుదల చేస్తుండటం ఉత్తర కొరియాకు కొత్తేం కాదని అమెరికా అధికారులు చెబుతున్నారు. గ‌తంలో ఇలా ఎన్నోసార్లు హ‌డావుడి చేసింద‌ని అమెరికా అధికారులు అంటున్నారు. రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఎప్పుడేం జ‌రుగుతుంద‌తో అన్న‌ట్లుగా ఉన్న ప‌రిస్థితుల్లో ఉత్త‌ర కొరియా దూకుడు ప్ర‌పంచ దేశాల‌ను టెన్ష‌న్ పెడుతోంది.

Full View

Like Us on Facebook : 1https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News