కరోనా కాలంలో శకుని.. డబ్ల్యూహెచ్ వో

Update: 2022-05-05 10:48 GMT
ఎప్పుడు కరోనా తీవ్రత తగ్గినా.. అదిగో ఇదిగో మరో వేవ్ అంటూ అపశకునం మాటలు మాట్లాడుతోంది.. ఇదంతా ఏ చైనా సంస్థనో, మరో ప్రయివేటు సంస్థనో చేస్తున్నది కాదు.. సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వ్) నిర్వాకం. కరోనా కాలంలో డబ్ల్యూహెచ్ వో పోషించాల్సిన పాత్ర ఏమిటి..? పోషించిన పాత్ర ఏమిటి? అని ఈ రెండేళ్ల అనుభవాలను బట్టి చూస్తే ఆ సంస్థ పేరుకు మాత్రమే ఉన్నదని స్పష్టమవుతోంది. నిపుణులే కాదు.. కాస్త ఆలోచించగలిగిన ప్రజలూ కొవిడ్ పై డబ్ల్యూహెచ్ వో చేసిన ప్రకటనలను విని నవ్వుకున్నారు.

బాధత్య ఉండక్కర్లే..ఇప్పడే కాదు.. రెండేళ్ల కిందట ప్రపంచమంతా కొవిడ్ తో అల్లాడుతున్న సమయంలోనూ డబ్ల్యూహెచ్ వో స్పందించిన తీరు తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆ సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ అయితే ఏకంగా చైనాను వెనకేసుకొచ్చేట్లు మాట్లాడారు. వాస్తవానికి కరోనా చైనాలోనే ఉద్భవించినట్లు 99 శాతంమందికి అనుమానాలున్నాయి. కానీ, ఈ దిశగా డబ్ల్యూహెచ్ వో చేసిన విచారణ ఏమీలేదు.అంతెందుకు రెండున్నరేళ్లు అవుతున్నా.. వైరస్ ఎక్కడ పుట్టిందో ఇప్పటిదాకా చెప్పలేకపోయింది. గతేడాది ఫిబ్రవరిలో చైనాకు పంపిన డబ్ల్యూహెచ్ వో ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏమీ తేల్చలేదు. అంతేకాక.. కరోనా తొలుత చైనాలోనే పుట్టిందని చెప్పి, ఆ వెంటనే కమిటీ మాట మార్చింది. మళ్లీ ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు.

కొత్త వేరియంట్లపైనా అదే తీరు కొవిడ్ పైన బాధ్యత లేకుండా ప్రకటనలు చేయడమే కాదు.. కొత్త వేరియంట్లపైనా డబ్ల్యూహెచ్ వో చేసే ప్రకటనలు అంతే బాధ్యతారహితంగా ఉంటున్నాయి. ఉదాహరణకు గురువారం టెడ్రోస్ అధానమ్ చేసిన ప్రకటననే గమనిస్తే.. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా  కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నట్లు డబ్ల్యూహెచ్ వో నివేదిక పేర్కొంది. గత వారం 15 వేల మరణాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య కరోనా ప్రారంభ రోజుల నాటి స్థాయికి పడిపోయినట్లు సంస్థ తెలిపింది. ఇదే సమయంలో ఇది సానుకూల పరిణామమే అయినప్పటికీ.. పలు దేశాల్లో పరీక్షల సంఖ్య తగ్గడం కారణం కావొచ్చన్నారు. అలాగే అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ల కారణంగా కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు.

ట్రంప్ కు సైతం ఒళ్లు మండింది..కొవిడ్ విషయంలో తొలినాళ్లలోనే అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ నకు డబ్ల్యూహెచ్ వోపై ఒళ్లు మండింది. ఆ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన .. డబ్ల్యూహెచ్ వో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తర్వాత సైతం డబ్ల్యూహెచ్ వోను పనికిమాలిన సంస్థ అనే రీతిలో తీసివేశారు. దానికి నిధులివ్వబోమని స్పష్టం చేశారు. అయితే, ట్రంప్ శకం ముగిశాక అమెరికా పెద్దగా దీనిపై ఆలోచన చేయనట్లు కనిపిస్తోంది.


ఒమిక్రాన్‌లో మార్పులపైనా ఆందోళన కలిగించేలా..ఒమిక్రాన్‌లో ఉత్పరివర్తనాలపై అధానామ్ గురువారం వ్యాఖ్యానిస్తూ.. పలు దేశాల్లో ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్ బీఏ.2 ఉనికి చాటుతున్నప్పటికీ.. బీఏ.4, బీఏ.5 సబ్‌ వేరియంట్లు దక్షిణాఫ్రికాలో కొత్త ఉప్పెనకు దారితీస్తున్నాయని వెల్లడించారు. చాలా దేశాల్లో ఈ వైరస్ ఎలా మార్పులు చెందుతుందో తెలుసుకోలేకపోతున్నామని, తర్వాత ఏం జరుగుతుందో తెలియదని వెల్లడించారు. వాస్తవానికి గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించారు. నాటి నుంచి వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం వెలుగుచూస్తోన్న కొత్త కేసుల్లో ఈ వేరియంటే అత్యధికంగా కనిపిస్తోంది. కాగా, ఈ వేరియంట్ ఉపరకాలు ఉత్పరివర్తన చెందుతుండటంతో వాటి లక్షణాల్లో మార్పు కనిపిస్తోందని ఆరోగ్య సంస్థ తాజాగా నివేదికలో పేర్కొంది. 'బీఏ.4, బీఏ.5 సబ్‌వేరియంట్లు దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చాయి. మిగిలిన దేశాలు జన్యుక్రమాన్ని విశ్లేషించడాన్ని మానివేయగా.. దక్షిణాఫ్రికా కొనసాగిస్తోంది. అందుకే, వాటిని గుర్తించగలిగాం. వ్యాక్సినేషన్.. ప్రజలను రక్షించుకోవడావడానికి మనముందున్న మార్గం. దాంతోపాటు కొవిడ్ నియమావళిని పాటించాలి' అంటూ టెడ్రోస్‌ వెల్లడించారు. కొత్త వేరియంట్లపై ప్రజలను చైతన్యం చేయాల్సింది పోయి.. అధానమ్ చేస్తున్న ప్రకటనలు డబ్ల్యూహెచ్ వో అధ్వాన పరిస్థితిని చాటుతున్నాయి.

కొవిడ్ చైనాలో పుట్టినట్లు గుర్తించినట్లయితే..ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కొవిడ్ చైనాలోనే పుట్టినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించి ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేది. ప్రపంచంలో చైనా ఏకాకి అయ్యేది. కానీ, ఆ దేశ బెదిరింపులు చూసో.. ధన బలం కారణంగానే డబ్ల్యూహెచ్ వో ఆ పని చేయలేకపోయింది. దీంతో కొవిడ్ జన్మస్థానం గుర్తింపు ఇక ఎప్పటికీ తెలుసుకోలేని రహస్యంగా మిగిలిపోయింది. అసలు వైరస్ ఉద్భవించిన తొలినాళ్లలోనే చేపట్టాల్సిన విచారణను ఏడాది తర్వాత నిర్వహించడమే డబ్ల్యూహెచ్ వో డొల్లతనాన్ని చాటుతోంది.

చేసిందేమిటయ్యా అంటే..కరోనా వచ్చాక డబ్ల్యూహెచ్ వో చేసిన ఏకైక పని ఏమిటయ్యా అంటే.. ఆ వైరస్ కు కొవిడ్ -19గా పేరు పెట్టడం. 2019లో వైరస్ పుట్టింది కాబట్టి, కరోనా వంశానికి చెందినది కాబట్టి.. రెండూ కలిపి కొవిడ్ -19గా పేరుపెట్టింది.
Tags:    

Similar News