ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 39.44లక్షల కోట్ల బడ్జెట్. ఈ భారీ బడ్జెట్ ను ఇంకాస్త సరిగా అంకెల్లో చూస్తే.. రూ.39,44,909 కోట్లు. మరి.. ఇంత భారీ బడ్జెట్ ను సిం‘ఫుల్’ గా అర్థం చేసుకోవటం ఎలా అన్నది ప్రశ్న. ఈ భారీ అంకెల్ని వదిలేసి.. మొత్తం విషయాన్ని ఒక రూపాయిలోకి కుదించి వేస్తే.. విషయం అంతో ఇంతో అర్థమయ్యే పరిస్థితి. చేతికి వచ్చే ఆదాయం మొత్తాన్ని ఒక రూపాయిగా.. అదే సమయంలో చేసే ఖర్చు మొత్తాన్ని రూపాయి కిందకు కుదించి వేస్తే.. దేని నుంచి ఎంత వస్తుంది? దేని కోసం ఎంత ఖర్చు చేస్తున్నామన్న విషయం ఇట్టే అర్థమయ్యే అవకాశం ఉంది.
అసలు విషయాన్ని చెప్పే వేళలో.. ఒక చిన్న ఉదాహరణను చెప్పటం ద్వారా బడ్జెట్ లెక్క మరింత తేలిగ్గా అర్థమయ్యేలా చెబుతాం. ఒక వ్యక్తి తనకు ఏడాది వ్యవధిలో ఎంత ఖర్చు అవుతుందని లెక్క వేసుకొని.. ఆ ఖర్చుకు తగినట్లుగా ఎంత ఆదాయం వస్తుంది? మరేమైనా అప్పు చేయాల్సి ఉంటుందా? అన్న లెక్క వేసుకున్నామనుకోండి.. అది మన సొంత బడ్జెట్ అవుతుంది. అదే లెక్కను దేశానికి ఆపాదిస్తే.. దేశ బడ్జెట్ అవుతుంది.
సాధారణంగా ఏడాది వ్యవధిలో మన ఖర్చు ఎంత ఉంటుంది? అన్న ప్రశ్నను ఎవరిని వేసినా.. వెంటనే చెప్పలేరు. కొంతమంది లెక్కలు వేసుకునే వారు చప్పున చెప్పేస్తారు. చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం వెంటనే చెప్పలేరు. ఇలాంటి పరిస్థితి వ్యక్తికి ఉంటే ఓకే. కానీ.. ప్రభుత్వానికి ఉండకూడదు కదా. లెక్కగా నడుచుకోవాలె. అందుకే.. ఈ బడ్జెట్ వ్యవహారం అంతా కూడా.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన నాలుగో బడ్జెట్ ను చూసినప్పుడు.. మోడీ సర్కారు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది. ప్రభుత్వ బండిని నడపటానికి.. ఏడాది వ్యవధిలో తాను అనుకున్న పనుల్ని చేయటానికి భారీగా అప్పులు చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసిందని చెప్పాలి.
ఎందుకంటే.. తను ఖర్చు చేయాల్సిన రూపాయిని ఏ రూపంలో వస్తుందన్న విషయాన్ని చెప్పే క్రమంలో.. ప్రతి రూపాయికి 35 పైసలు.. అంటే మూడో వంతు అప్పుల ద్వారానే వస్తుందని వెల్లడించింది. అంటే.. మనం ఘనంగా ఫీల్ అవుతున్న అంకెల్లో అప్పు భారం ఎంతన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.
మోడీ సర్కారు చూసే ఖర్చుకు అవసరమైన ఆదాయాన్ని రూపాయికి కుదించి చూస్తే.. అప్పులు పెద్ద ఎత్తున చేయటానికి సిద్ధమైన విషయం ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వం చేసే ఖర్చులకు అవసరమైన ఆదాయం ఏయే రూపాల్లో వస్తుందన్న విషయాన్ని చూస్తే..
రూపాయి వచ్చే తీరు ఇదే
- అప్పులు.. ఇతర రుణాల్ని తీసుకోవటం ద్వారా 35 పైసలు
- జీఎస్టీ 16 పైసలు
- కార్పొరేట్ పన్ను ద్వారా 15 పైసలు
- ఆదాయపన్ను ద్వారా వచ్చేది 15 పైసలు
- యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 07 పైసలు
- కస్టమ్స్ ద్వారా వచ్చే పన్ను ఆదాయం 05 పైసలు
- నాన్ ట్యాక్స్ రెవెన్యూ (పన్నేతర ఆదాయం) 05 పైసలు
- రుణేతర పెట్టుబడి ఆదాయం 02 పైసలు
వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం మొత్తం రూపాయిగా కుదిస్తే.. దాన్ని వేటి కోసం ఎలా ఖర్చు చేస్తారు అని చూస్తే..
- ఇప్పటికే చేసిన అప్పుల మీద వడ్డీ కట్టేందుకు 20 పైసలు
- వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రానికి ఇవ్వటానికి 17 పైసలు
- కేంద్రం అమలు చేసే పథకాల కోసం 15 పైసలు
- ఫైనాన్స్ కమిషన్ చెల్లింపులు 10 పైసలు
- కేంద్రం అమలు చేసే స్కీంలు 09 పైసలు
- ఇతర ఖర్చులు.. చెల్లింపులు 09 పైసలు
- రక్షణ 08 పైసలు
- సబ్సిడీలు 08 పైసలు