తనిష్క్ మరో దుమారం.. నెటిజన్ల బాయ్ కాట్ పిలుపు!

Update: 2020-11-09 18:00 GMT
ప్రముఖ ఆభరణాల విక్రయదారు తనిష్క్ చిక్కుల్లో పడింది. ఇటీవలే తనిష్క్ చేసిన యాడ్ వివాదాస్పదమైంది. రెండు మతాల వారు కలిసి జరుపుకునే పండుగను చూపించి దుమారం రేపింది. నెటిజన్లు, కొన్ని పార్టీలు ‘లవ్ జిహాద్’ను ఈ యాడ్ ప్రోత్సహించే విధంగా ఉందంటూ పెద్ద లొల్లి చేశారు.

దీంతో గబారా పడ్డ తనిష్క్ వెంటనే ఆ యాడ్ ను తొలగించి మనోభావాలు దెబ్బతిన్నందుకు సారీ చెప్పింది. ఆ తప్పుదిద్దుకోకముందే తనిష్క్ మరో దుమారం రేపింది.

తాజాగా దీపావళి నేపథ్యంలో తనిష్క్ మరో యాడ్ తీసి అభాసుపాలైంది. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చరాదని.. కేవలం దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవాలని తనిష్క్ తన యాడ్ లో చూపించింది. ఈ దీపావళి యాడ్ కూడా తాజాగా వివాదాస్పదమైంది.

కర్ణాటకకు చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి సోషల్ మీడియా వేదికగా ఈ యాడ్ ను షేర్ చేసి ఫైర్ అయ్యారు. ‘హిందువుల పండుగలను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే విషయాన్ని ఎందుకు చెబుతారు. ఒక వర్గం సంస్కృతి సంప్రదాయాలపై లెక్చర్లు ఇవ్వకూడదని.. మీకేంటి నొప్పి.. దీపావళికి దీపాలు వెలిగిస్తాం.. స్వీట్లు పంచుతాం.. బాణాసంచా కాలుస్తాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Tags:    

Similar News