అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకుల పరంపర కొనసాగుతోంది. తన కఠిన - వివాదాస్పద నిర్ణయాలతో ఇప్పటికే వేలాది మంది భారతీయులు ఇబ్బందులు పడగా...తాజాగా మరికొందరు సైతం అదే పరిస్థితిని ఎదుర్కున్నారు. మెక్సికోలో నివసిస్తున్న భారత్ కు చెందిన 311 మంది అక్రమ వలసదారులను ఆ దేశం తిరిగి భారత్‌కు పంపించి వేసింది. అమెరికానుంచి ఎదురవుతున్న ఒత్తిళ్ల కారణంగా వివిధ ప్రాంతాల్లో సరిహద్దులు దాటి తమ దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని అరికట్టే క్రమంలో మెక్సికో ఇమ్మిగ్రేషన్ అధికారులు చర్యలు చేపట్టి ఈ మేరకు భారతీయులను పంపించారు.
మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి ప్రవేశించేవారికి చెక్ పెట్టకపోతే మెక్సికో నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై సుంకాలు విధించనున్నట్లు యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. యూఎస్ ఒత్తిడి మేరకు మెక్సికో ప్రభుత్వం దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను గుర్తించిందేకు తనిఖీ చేపట్టింది. ఈ క్రమంలో చట్టబద్ధంగా దేశంలో ఉండటానికి అర్హత లేని భారతీయులను సైతం గుర్తించింది. ఇలా మెక్సికో ప్రభుత్వం 311 మంది భారతీయులను వెనక్కి పంపేసింది. వీరిని టొలుకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్ 747 ఎయిర్ క్రాఫ్ట్ లో న్యూఢిల్లీకి చేరుకున్నారు.
ఇదిలాఉండగా, అమెరికాలో నివాసం ఉండాలనే ఆశ -కల నెరవేర్చుకునేందుకు పలువురు అడ్డదారులను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. స్వదేశీయులకే ఉపాధి అవకాశాలు అని, ఎన్నారైలలో అత్యంత ప్రతిభావంతులకే అవకాశం అంటూ చెబుతున్న ట్రంప్ తన విదేశీవిధానంలో మార్పు చేయడం లేదు. దీంతో ఎలాగైనా అమెరికాలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే కొందని ఆశను ఏజెంట్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అంతర్జాతీయ ఎజెంట్ల ద్వారా భారతీయులు అక్రమంగా అమెరికా వెళ్లటానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు గాను ఒక్కొక్కరూ 25 నుంచి 30 లక్షలు చెల్లిస్తున్నారు. ఇలా డబ్బులు చెల్లించి, ఇతరుల సూచనలు నమ్మి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న వారిపై మెక్సికో ప్రభుత్వం దృష్టి పెట్టగా...అందులో పలువురు పట్టుబడ్డారు. వారిలో ఇండియన్లు ఉండగా...తాజాగా వారిని ఆ దేశం వెనక్కి పంపింది.