వామ్మో.. ఇక విశాఖలో వాహనదారులు అలర్ట్‌గా ఉండాల్సిందే!

Update: 2023-01-07 09:30 GMT
ఇక ఏపీలో అతిపెద్ద నగరం విశాఖపట్నంలో వాహనదారులు అలర్ట్‌ గా ఉండాల్సిందే. లేకుంటే భారీగా చలనాలు చెల్లించక తప్పదు. ఇప్పటికే విశాఖలో వాహనదారులు రూ.90 కోట్ల మేర ట్రాఫిక్‌ జరిమానాలు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

హెల్మెట్‌ పెట్టుకోకపోవడం, వేగంగా బండి నడపటం, మద్యం తాగి వాహనం నడపటం, డ్రైవింగ్‌ లైసెన్సు లేకపోవడం, త్రిబుల్‌ రైడింగ్, రెడ్‌ సిగ్నల్‌ పడ్డప్పుడు పట్టించుకోకుండా వెళ్లిపోవడం, లైన్‌ క్రాస్‌ చేయడం, నో పార్కింగ్‌ ప్రాంతంలో బండిని నిలపడం ఇలా పలు ట్రాఫిక్‌ రూల్స్‌ ను అతిక్రమించడంతో విశాఖలో వాహనదారులపైన రూ.90 కోట్ల జరిమానాలు పెండింగులో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వీటిని వసూలు చేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. విశాఖ నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలైన జగదాంబ జంక్షన్, స్టీల్‌ ప్లాంట్‌ రోడ్డు, ఏయూ ప్రాంతం, ఆర్కే బీచ్, భీమిలి రోడ్డు, గాజువాక తదితర ప్రాంతాల్లో స్పెషల్‌ రైడ్స్‌ నిర్వహిస్తారని చెబుతున్నారు.

ఇప్పటిదాకా చూసి చూడనట్టు వదిలేయడంతో ఈ మొత్తం జరిమానాలు రూ.90 కోట్లకు చేరుకున్నాయని అంటున్నారు. ఇక నుంచి ఉదాసీనతకు అవకాశం ఇవ్వకుండా ట్రాఫిక్‌ రూల్స్‌ ను నిక్కచ్చిగా పాటించాలని అధికారులు నిర్ణయించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారుల నుంచి రూ.90 కోట్లను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొంటున్నారు.

ఈ 90 కోట్ల రూపాయలను వసూలు చేయడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారని చెబుతున్నారు. ఇక ఎక్కిడికక్కడ వాహనదారులకు జరిమానాలు విధించడం, వసూలు చేయడం చేస్తారు.

ఇంతకు ముందు కట్టని వారి నుంచి ముక్కు పిండి మరీ వసూల్‌ చేస్తారని చెబుతున్నారు. ట్రాఫిక్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను విశాఖ నగరంలో దింపుతున్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ ని నిర్వహించడం ద్వారా ఈ మొత్తాన్ని వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇక నుంచి విశాఖలో వాహనదారులు గతంలో మాదిరిగా ఎలా పడితే అలా బండి నడపడం కుదరదు. ట్రాఫిక్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. హెల్మెట్, లైసెన్సు లేకపోయినా, అతివేగంగా నడిపినా, మద్యం సేవించి బండి నడిపినా, రెడ్‌ సిగ్నల్‌ జంప్‌ చేసినా, త్రిబుల్‌ రైడింగ్‌ చేసినా జరిమానాలు విధించనున్నారు. జరిమానాలు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News