మహారాష్ట్ర ప్రభుత్వం పెను సంచలనం సృష్టించింది. ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ కేబినెట్ లోని కేంద్రమంత్రిని అరెస్ట్ చేసి సవాల్ చేసింది. ఒక యూనియన్ మినిస్టర్ ను అధికారంలో ఉండగా అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. ఇదో సాహసోపేతమైన చర్యనే. దానికి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే పూనుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది.
మహారాష్ట్ర ఉద్దవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ రాణేను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది. సీఎం ఉద్దవ్ ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదు అందడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
మహారాష్ట్రలోని కొంకణ్ లో జన ఆశీర్వాద యాత్ర ర్యాలీలో పాల్గొన్న రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదే ముందే గ్రహించి రత్నగిరి కోర్టులో నారాయణ రాణే ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే అది రద్దు అయ్యింది.
బెయిల్ పిటీషన్ రద్దయిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా కేంద్రమంత్రిని అరెస్ట్ చేశారు. దీంతో మహారాష్ట్రలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
అంతకుముందే రాణేను అరెస్ట్ చేస్తున్నట్లు నాసిక్ కమిషనర్ పాండే ప్రకటించారు. అరెస్ట్ నేపథ్యంలో ముంబై హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేయగా నారాయణ్ రాణేకు చుక్కెదురైంది. అత్యవసరంగా పిటీషన్ విచారించలేదమని ముంబై హైకోర్టు తెలిపింది.
సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లు అయ్యిందో కూడా తెలియదని.. ఆగస్టు 15న తన సిబ్బందిని అడిగి తెలుసుకున్నాడని.. నేనే అక్కడ ఉంటే ఉద్దవ్ ఠాక్రే చెంప పగులగొట్టేవాడనని నారాయణ రాణే హాట్ కామెంట్స్ చేశారు. దానిపై కేసులు ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా.. తాజాగా అరెస్ట్ అయ్యారు.