ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. అలాంటి ఇల్లాలు చనిపోయి తీరని శోకంలో కూరుకుపోయిన ఆ కుటుంబానికి మరో విషాదం ఎదురైంది. భార్య శవాన్ని అంబులెన్స్ లో పెట్టుకుని బయల్దేరిన భర్తకు, పదేళ్ల కొడుకుకు ఘోర ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో పదేళ్ల కొడుకు చనిపోగా, అతని తండ్రి గల్లంతయ్యాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయి, మరొకరి గల్లంతు కావడంతో ఆ గ్రామం మొత్తం విషాదఛాయలే దర్శనం ఇస్తున్నాయి.
ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్-బారౌనీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే .. సిరాస్ గ్రామానికి చెందిన రామ్‌జీ లాల్, తన కొడుకు రామ్ నారాయణ్ తో కలిసి జైపూర్ లో పని చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. రామ్‌జీ భార్య గీతా దేవి స్వగ్రామంలో ఉంటోంది. కొంతకాలంగా ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. దీంతో ఆమెను జైపూర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా సోమవారం రాత్రి ఆమె మరణించింది. దీంతో ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు రామ్ జీ ఓ అంబులెన్స్ ఏర్పాటు చేశాడు.
గీతా దేవి మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్ సిబ్బంది, రామ్‌జీ, అతని పదేళ్ల కొడుకు రామ్‌నారాయణ్ సోమవారం రాత్రి జైపూర్ నుంచి బయల్దేరారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బౌరావి పోలీస్ స్టేషన్ సమీపంలోని వాగు దాటుతుండగా అంబులెన్స్ మునిగిపోయింది. దీంతో డ్రైవర్, అతడి సహచరులు అంబులెన్స్ కిటికీ నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. అంబులెన్స్ టాప్ మీద కూర్చుని అరవడంతో వారిని స్థానిక రైల్వే పోలీసులు కాపాడారు. అలాగే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన పదేళ్ల రామ్ నారాయణ్ మృతదేహం కూడా లభ్యమైంది. అయితే రామ్ జీ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. రామ్ జీ కూడా చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అతడి మృతదేహం గురించి గాలింపు చేపడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కన్నుమూయడం తో ఆ గ్రామవాసులు దుఃఖం లో మునిగిపోయారు.