'డక్‌ వర్త్‌ లూయిస్‌' ను పాఠ్యాంశంగా చేర్చాలట

Update: 2019-07-10 10:44 GMT
వర్షం కారణంగా మ్యాచ్‌ మద్యలో ఆగిన సమయంలో డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం మ్యాచ్‌ ను కుదించడం లేదంటే ఎవరినైనా ఒకరిని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ఇది ఎలా చేస్తారు అనే విషయం ఎవరికి అర్థం కాని విషయం. టీం ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మరియు ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలు కూడా తమకు డక్‌ వర్త్‌ లూయిస్‌ విధానం ఏంటో.. దాని ద్వారా ఫలితాన్ని ఎలా నిర్ధారిస్తారో తెలియదంటూ సమాధానం ఇవ్వడం జరిగింది.

వీరికి మాత్రమే కాకుండా ఇంకా చాలా మందికి కూడా ఈ విషయం గురించి తెలియదు. దాంతో ఐసీసీ నియమావళి అయిన డక్‌ వర్త్‌ లూయిస్‌ సిస్టమ్‌ ను ఇండియన్‌ సెంట్రల్‌ సెలబస్‌ లో చేర్చాలని పదవ తరగతి పిల్లలకు ఆ పాఠ్యాంశం ఉండాలంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వస్తున్నాయి. ఈసారి ప్రపంచ కప్‌ లో పలు సార్లు వర్షం మ్యాచ్‌ లకు అడ్డంకిగా మారింది. ఆ కారణంగా కొన్ని మ్యాచ్‌ లపై ఆసక్తి కోల్పోవడంతో పాటు.. కొన్ని ఫలితాలు తారు మారు అయ్యాయి.

ఈ కారణాల వల్ల సోషల్‌ మీడియాలో ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2019 గురించి ఇష్టం వచ్చినట్లుగా మీమ్స్‌ వస్తున్నాయి. అందులో ప్రధానంగా ఈ డక్‌ వర్త్‌ లూయిస్‌ సిలబస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గ్రౌండ్‌ లో భారీగా నీళ్లు ఉండి అంపైర్లు టాస్‌ వేయడం.. సెమీస్‌ కు వెళ్లిన కెప్టెన్‌ లు వర్షంలో నిలవడం వంటి మీమ్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తున్నాయి.
Tags:    

Similar News