ప్రజాసంఘాల ఆందోళనలు - కార్మిక సంఘాల ర్యాలీలు - పౌర హక్కుల నేతల కార్యక్రమాలు - ఉద్యమ సంస్థల సభలు - సమావేశాలపై ఇంతకాలం నిఘా ఉండేది. ఏం మాట్లాడుకున్నారు.. ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారు.. ఎవరెవరు వచ్చారు... వారి తదుపరి కార్యాచరణ ఏంటి వంటివన్నీ గుట్టుగా ఆరా తీసి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం నిఘా వర్గాల పని. దీనికోసం నిత్యం పోలీసు శాఖ - నిఘా శాఖల నుంచి కొందరు ఇదే పనిపై ఉంటారు. ఇప్పుడు నిఘా పరిధిలోకి మరో కొత్త అంశం వచ్చి చేరుతోంది. సంపన్నుల ఇళ్లలో శుభకార్యాలు కూడా నిఘా చట్రంలోకి వస్తున్నాయట. అయితే... దీనిపై నిఘా వేసేది మాత్రం ఆదాయ పన్ను శాఖ అధికారులు. పెద్దనోట్లు రద్దు తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో సంప న్నుల కుటుంబాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహి స్తున్న వివాహ కార్యక్రమాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు వీడియోల్లో బంధించడంతో పాటు ఈ కార్యక్రమానికి హాజర వుతున్న ముఖ్యులు ఎవరన్న అంశంపై ఆరా తీసేపనిలో నిమగ్నమయ్యారు. మైనింగ్ డాన్ గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె వివాహానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన వైనంపై ఇప్ప టికే కూపీ లాగుతున్న అధికారులు ఈ నెల 8వ తేదీ తరువాత హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి నగరాల్లో జరిగిన సంపన్నుల కుటుంబాల వివాహ వివరాలను సేకరించి సంబంధితులకు నోటీసులను పంపే పనిలో ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికే కొంత మంది బడా పారిశ్రామికవేత్తలకు, స్థిరాస్తి వ్యాపారులు, ముఖ్యులకు ఐటిశాఖ నోటీసులు ఇచ్చి పది రోజు ల్లో సమాధానం ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. నోటీసులు అందుకున్న వారిలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఆయా పార్టీల ముఖ్య నేతలు కూడా ఉండడం గమనార్హం. వివాహానికి సంబంధించి బంగా రు ఆభరణాలు, వస్త్రాలు, కేటరింగ్ సర్వీసులు, వివాహ వేదిక ముస్తాబు చేసిన సంస్థలు, వాటి వివరాలను కూడా అందజేయాలని, ఎంతెంత ఖర్చు పెట్టారో ఆ సమాచారాన్ని కూడా అందజేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఐటి శాఖ పంపిన నోటీసులు అందుకున్న కొందరు ప్రముఖులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో నోటీసులకు ఎలా బదులివ్వాలన్న అంశంపై వారికి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్లను సంప్రదిస్తున్నారు.
మరోవైపు ఈ రోజు హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఒక హైదరాబాద్‌లోనే నేడు పదివేల వరకు వివాహాలు ఉన్నాయని ఐటీ శాఖకు సమా చారం అందింది. మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్షన్ సెంటర్, శిల్ప కళావేదిక, జూబ్లిహిల్స్‌లోని జేఆర్‌సి కన్వెన్షన్ సెంటర్, సికిం ద్రాబాద్‌లోని హరిహర కళాభవన్, బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల, నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానం, శంషాబాద్‌లోని పేరొందిన కన్వెన్షన్ కేంద్రాలతో పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో గురువారం జరుగుతున్న ప్రముఖుల వివాహ వేడుకల వివరాలను సేకరించేందుకు ప్రత్యేక బృందాలు ఇప్ప టికే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అత్యంత వైభవోపే తంగా జరిగే వివాహాలను వీడియో కెమెరాల ద్వారా బంధిం చేందుకు ఐటి శాఖ అధికారులు సినీ రంగంలోని కొంతమంది కెమెరా మెన్ల ససహకారాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అతిథులలాగా ఐటి శాఖ అధికారులు కూడా వివాహానికి, విందు కార్యక్రమానికి హాజరవుతారని, ఎవరికీ అనుమానం రాకుండా వారు వచ్చిన పనిని పూర్తి చేసుకుని అక్కడి నుంచి సమాచారం సేకరిస్తారని తెలుస్తోంది. బడా వ్యాపారులు తమ దగ్గరు న్న నల్లధనాన్ని వివాహ, విందు కార్యక్రమాలకు విచ్చలవిడిగా వినియోగిస్తూ సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించేందు కు తమదైనశైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నారన్న సమాచారం ఐటి శాఖకు అందింది. కొంతమంది తమ దగ్గరున్న నల్లధ నాన్ని మార్చుకోవడానికి వివాహం పేరుతో నాటకాలాడి బ్యాంకు నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్ర ఆర్థికశాఖ ఆయా రాష్ట్రాల ఐటిశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. వివాహాలపై నిఘా పెట్టాలని కోరింది. దీంతో ఇప్పటికే జరిగిన పెళ్ళిళ్ళతో పాటు ఇకనుంచి జరిగే వివాహ, విందు వేడుకలకు ఎంతమేర ఖర్చు పెడుతున్నారో స్వయాన పరిశీలించి బాధ్యులైన వారికి నోటీసులు జారీ చేయా లని ఆదేశించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/