భారత దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చినా అంబానీల మాట మాత్రం చెల్లుబాటు అవుతుంటుందంటారు. దేశంలోనే అపర కుబేర కుటుంబమైన అంబానీలకు దేశంలోని రాజకీయ పార్టీలే గులాంలుగా మారిపోయాయన్న విమర్శలున్నాయి. అయితే తాజాగా బీజేపీ ప్రభుత్వం హయాంలో అంబానీల కుటుంబానికి ఐటీ నోటీసులు వెళ్లాయన్న వార్తలు సంచలనంగా మారాయి... మార్చి 28, 2019లో ఆదాయపు పన్నుశాఖ విదేశాల్లో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని అంబానీ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చిందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.
బ్లాక్ మనీ యాక్ట్ 2015 కింద ఆదాయపు పన్ను శాఖ దేశంలోనే కుబేరుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ... వారి సంతానం అనంత్, ఆకాష్, ఇషా అంబానీలకు ఈ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. వీరు అనేక దేశాల్లో విదేశీ ఆదాయాన్ని , ఆస్తులను కలిగి ఉన్నారని.. ఐటీ రిటర్న్ లో సమాచారం ఇవ్వలేదని ఐటీ నోటీసులు పంపినట్టు తెలిసింది.
2015లో స్విస్ లీక్స్ విడుదలయ్యాయి. స్విట్జర్లాండ్ లోని 14 హెచ్ ఎస్.బీసీ జెనీవా బ్యాంక్ ఖాతాల వివరాలు బయటపడ్డాయి. ఈ వార్తలను ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదించింది. ఇందులో కొందరు మధ్యవర్తుల ద్వారా రిలయన్స్ గ్రూపులోకి భారీగా పెట్టుబడులు వచ్చాయని.. దేశీయ.. విదేశీ సంస్థలు భారీ మొత్తాన్ని జమ చేశారని పేర్కొన్నారు. ఇవన్నీ అంబానీ కుటుంబ సభ్యులున్న రిలయన్స్ గ్రూపులోనే జమ అయ్యాయని ఐటీ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం.
అయితే ఐటీ శాఖ తమకు నోటీసులు ఇచ్చిందన్న వార్తలను రిలయన్స్ ప్రతినిధులు ఖండించారు. ఇది పూర్తిగా సత్యదూరమని.. ఐటీ శాఖ అంబానీ ఫ్యామిలీ సభ్యులకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని రిలయన్స్ స్పష్టం చేసింది.