ల‌క్ష మందికి ఐటీ నోటీసులు . ఎందుకంటే..?

Update: 2017-11-08 06:10 GMT
తాజాగా దేశ వ్యాప్తంగా ల‌క్ష మందికి ఆదాయ‌ప‌న్ను శాఖ నోటీసులు జారీ చేసింది. పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌ర్వాత బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో న‌గ‌దు జ‌మ చేసిన దాదాపు ల‌క్ష మంది వ్య‌క్తుల‌ను గుర్తించిన ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు నోటీసులు పంపారు. వారంలో వీరికి నోటీసులు పంప‌నున్న‌ట్లు చెబుతున్నారు.

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత రూ.50 ల‌క్ష‌ల న‌గ‌దును బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసిన 70వేల మందికి మొద‌ట నోటీసులు అంద‌నున్నాయి. ఐటీ యాక్ట్ సెక్ష‌న్ 142(1) కింద ఐటీశాఖ ఈ నోటీసుల్ని జారీ చేస్తోంది.

పెద్ద మొత్తంగా న‌గ‌దు లావాదేవీల్ని జ‌రిపిన వారి గ‌త చ‌రిత్ర‌ను ప‌రిశీలించి మ‌రో 30 వేల మందికి నోటీసులు పంపిన‌ట్లు తెలుస్తోంది. ఇలా నోటీసులు అందుకున్న వారు ఐటీ శాఖ‌కు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆప‌రేష‌న్ క్లీన్ మ‌నీలో భాగంగానే ఈ నోటీసులు పంపుతున్న‌ట్లుగా అధికారులు వెల్ల‌డించారు.

బ్యాంకుల్లో రూ.50ల‌క్ష‌లు న‌గ‌దు డిపాజిట్ చేసిన వారికి నోటీసులు అందితే.. వాటికి త‌ప్ప‌నిస‌రిగా వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ప్ర‌క‌టించిన త‌ర్వాతి రోజు నుంచి ఐటీ శాఖ 2017 మార్చి నాటికి 900 సోదాలు నిర్వ‌హిస్తే.. రూ.900 కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది. ఇందులో రూ.636 కోట్ల క్యాష్ ఉంది. లెక్క చెప్ప‌ని ఆదాయం దాదాపు రూ.7961 కోట్లుగా అధికారులు గుర్తించారు.

అధికారికంగానే లెక్క‌లు ఇలా ఉంటే.. అన‌ధికారికంగా లెక్క‌లు మ‌రెంత భారీగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయినా.. 900 సోదాల‌కు రూ.900 కోట్ల ఆస్తులు మాత్ర‌మే సీజ్ చేయ‌ట‌మా? అంటే.. అక్ర‌మాస్తులు భారీగా పోగేశార‌న్న స‌మాచారం అందిన వారిపై త‌నిఖీలు చేసిన‌ప్పుడు స‌రాస‌రిన రూ.కోటి మాత్ర‌మే అక్ర‌మాస్తులు ల‌భించాయా?  చూస్తుంటే.. లెక్క ఏదో తేడా కొడుతున్న‌ట్లుగా అనిపించ‌ట్లేదు?

Tags:    

Similar News