కేంద్ర ప్రభుత్వం అక్రమార్కులపై తన దాడిని మరింత విస్తృతం చేసింది. ఇదివరలో ఫలానా వ్యక్తిపై ఐటీ దాడులు చేయాలంటే ఫిర్యాదు చేసి ఉండటం కానీ, లేదంటే పై అధికారుల ఆదేశాలకోసం గానీ వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇకపై పరిస్థితి అలా ఉండదు. దాడి ఎందుకు చేస్తున్నారో కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకుండా కేంద్రం అధికారులకు పవర్స్ ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తులున్నా.. పన్ను ఎగవేసినట్లు ఆధారాలు దొరికితే చాలు..ఇంటిపైగానీ సంస్థలపైగానీ విరుచుకుపడేందుకు దేశంలో ఐటీ ఆఫీసర్లకు కేంద్రం విస్తృత అధికారాలు ఇచ్చింది.
తాజాగా ఆమోదం పొందిన తాజాగా ఆమోదం పొందిన కేంద్ర ప్రభుత్వ ఆర్థిక బిల్లులో 40 చట్టాలకు చేసిన సవరణల్లో ఇలాంటి పలు నిర్ణయాలున్నాయి. ఇక నుంచి అసిస్టెంట్ కమిషనర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి ఆదాయ పన్ను అధికారి ఎవరైనా సొంత నిర్ణయం తీసుకొని వ్యక్తుల ఇళ్లపై లేదా సంస్థలపై దాడి చేయొచ్చు. ఇప్పటి దాకా ఇలాంటి ఆదేశాలను ప్రిన్సిపల్ కమిషనర్ లేదా డీజీ స్థాయి అధికారి చేసేవారు. ఒక్కసారిగా నాలుగు అంచెల కింద ఉన్న అధికారులకు ఈ పవర్స్ అప్పగించేశారు. అంతేకాదు ఆస్తులపై దాడుల సమయంలో సదరు వ్యక్తి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే జప్తు కూడా తీసుకునే నిర్ణయం ఐటీశాఖ అధికారులు తీసుకోవచ్చు. అయితే ఇలా చేయడం వల్ల అధికారుల అవినీతికి హద్దు లేకుండా పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించే చర్య అని విపక్షాలు ఆరోపించాయి. అక్రమార్కుల విషయంలో కఠినంగా వ్యవహరించడాన్ని ఎవరూ తప్పుపట్టబోరని అయితే తాజా అనుమతులు ఆ దిశగా కాకుండా కక్షసాధింపు కోణంలో ఉన్నాయని మండిపడ్డాయి. తమ వాదనకు మద్దతుగా ఈ బిల్లును అడ్డుకొనేందుకు తమ బలం అధికంగా ఉన్న రాజ్యసభలో ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. ఐదు సవరణలు చేశాయి. కానీ, లోక్ సభ వాటిని తిరస్కరించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/