ప్రముఖ సినీ హీరో ఎన్టీఆర్ మామ - స్టూడియో ఎన్ ఛానల్ అధినేత నార్నె శ్రీనివాసరావు ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయి. బుధవారం ఆదాయపు పన్ను శాఖ వారు నార్నె ఆస్తులుపై దాడులు చేయడంలో భాగంగా - హైదరాబాద్ లోని ఆయన సొంత చానల్ స్టూడియో ఎన్ ఆఫీసుపై ఐటీ దాడులు జరిగాయి. అయితే ప్రస్తుతానికి ఈ దాడులు కొనసాగుతున్నాయి. కాగా, నార్నె శ్రీనివాసరావు రాజకీయాల్లో సుపరచితమైన వ్యక్తి కూడా. మొన్న 2019 ఎన్నికలకు ముందు ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
అయితే ఆయన గుంటూరు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయనకి జగన్ ఏ సీటు ఇవ్వలేదు. దీంతో పార్టీ లీడర్ గానే కొనసాగుతున్నారు. అయితే నార్నె మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బంధువు కూడా. నార్నె భార్య చంద్రబాబుకు మేనకోడలు అవుతుంది. ఇక ఆ బంధుత్వంతోనే చంద్రబాబు బావమరిది హరికృష్ణ తనయుడు - సినీ హీరో ఎన్టీఆర్ కు నార్నె తన అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు.
2011లో జరిగిన ఈ పెళ్లి తర్వాత అటు ఎన్టీఆర్ తో పాటు నార్నెకు చంద్రబాబుకు మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఇదిలా ఉంటే గత 5 రోజులుగా దేశవ్యాప్తంగా మేఘా ఇంజనీరింగ్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఎండి కృష్ణారెడ్డి ఆస్తులపై ఐటీ దాడులు నిర్వహించిన తరువాత నార్నె ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయి. ఆదాయపు పన్ను శాఖ కొంతకాలంగా ధనవంతులైన వ్యాపారవేత్తలను - పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి.