దాదాపుగా రెండు రోజులకు పైనే తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాల మీద సోదాలు జరిపి.. పెద్ద ఎత్తున ఫైళ్లు స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. హార్డ్ డిస్క్ మొదలు.. వివిధ లాకర్లతో పాటు.. ఇంట్లో లభించిన పత్రాల్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లిన ఐటీ అధికారులకు ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారినట్లుగా తెలుస్తోంది.
రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారిన ఈ ఫైళ్ల వ్యవహారంపై ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. రేవంత్ ఇంట్లో దొరికిన ఫైళ్లకు సంబంధించి రేవంత్ సంధిస్తున్న ప్రశ్నలకు ఐటీ అధికారులు మాటల కోసం వెతుక్కుంటున్నట్లుగా చెబుతున్నారు.
తన ఇంటి మీదకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించటం ఖాయమన్న విషయంపై పక్కా సమాచారంతో రేవంత్ తనదైన మేజిక్ ను ప్రదర్శించినట్లు చెబుతున్నారు. ఓటుకు నోటు ఎపిసోడ్ లో అడ్డంగా బుక్ కావటం ద్వారా జీవిత కాలం అనుభవాన్ని సంపాదించుకున్న ఆయన.. తన ఇంట్లో జరిగే తనిఖీలకు ముందస్తుగానే రేవంత్ రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే బిగ్ షాట్లకు సంబంధించిన పత్రాల్ని తన ఇంట్లో ఫుల్ గా పెట్టేసినట్లుగా చెబుతున్నారు. రేవంత్ ఇంట తనిఖీల సందర్భంగా లభించిన పత్రాలు రేవంత్ ఆస్తులకు సంబంధించి కావని.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులకు సంబంధించిన రహస్య పత్రాలన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఐటీ అధికారుల విచారణ సందర్భంగా రేవంత్.. తన ఇంటి నుంచి తీసుకెళ్లిన ఫైళ్లకు సంబంధించిన విచారణ ఎప్పుడని ఎదురు ప్రశ్న వేయటం.. ఏం ఫైళ్లు.. మేం ఎలాంటి ఫైళ్లు తీసుకురాలేదుగా? అన్న మాట అధికారుల నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. తన ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫైళ్లలో ఏముందన్నది తనకు తెలుసని.. వాటి జిరాక్స్ కాపీల సెట్లు తన దగ్గర ఉన్నాయన్న మాట రేవంత్ నోటి నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. రేవంత్ ఇంట జరిపిన సోదాలతో ఫైర్ బ్రాండ్ బుక్ కావటం కాదు.. కేసీఆర్ కు అత్యంత ఆఫ్తులుగా ఉన్న వారినే ఎదురు బుక్ చేయించినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో నిజం ఎంతన్నది కాలమే చెప్పాలి.
రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారిన ఈ ఫైళ్ల వ్యవహారంపై ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. రేవంత్ ఇంట్లో దొరికిన ఫైళ్లకు సంబంధించి రేవంత్ సంధిస్తున్న ప్రశ్నలకు ఐటీ అధికారులు మాటల కోసం వెతుక్కుంటున్నట్లుగా చెబుతున్నారు.
రేవంత్ ఇంట్లో జరిపిన తనిఖీల సందర్భంగా పెద్ద ఎత్తున ఫైళ్లు లభించిన వెంటనే ఐటీ అధికారులు తాము సాధించామన్న భావనతో వ్యవహరించారని తెలుస్తోంది. అయితే.. ఆ ఫైళ్లనను చదవటం మొదలు పెట్టిన వెంటనే.. వారి ముఖాల్లో ఆనందం తర్వాత..ఇబ్బందికర పరిస్థితి ఎదురైనట్లుగా చెబుతున్నారు.