జమ్మూ కశ్మీర్ కు కొనసాగుతున్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడమే కాకుండా... ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేస్తూ నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ చర్చకు మోదీ తీసుకున్న నిర్ణయం కంటే కూడా ఆ నిర్ణయంపై దాయాదీ దేశం పాకిస్థాన్ చేస్తున్న రచ్చరచ్చే కారణమని కూడా చెప్పక తప్పదు. అయితే ఎక్కడ కూడా తనకు అనుకూలంగా సింగిల్ మాట వినిపించని నేపథ్యంలో ఏకంగా భారత్ పైకి యుద్ధానికి పాక్ సన్నద్ధమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. లడక్ సమీపంలోని తన ఎయిర్ బేస్ వద్ద పాక్ సైన్యం యుద్ద సన్నాహాలు మొదలుపెట్టారని, ఏ క్షణాన్నైనా భారత్ - పాక్ యుద్ధం తప్పదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే పాక్ వ్యవహార సరళి చూస్తుంటే... భారత్ చేతిలో ఇప్పటికే చాలా దెబ్బలు తిన్న పాక్ యుద్ధానికి కాలుదువ్వే సాహసం చేసే అవకాశాలు లేవన్న వాదన వినిపిస్తోంది. ఆ కథేంటే చూద్దాం పదండి.
కశ్మీర్ కు మొన్నటిదాకా కొనసాగిన స్వయం ప్రతిపత్తిని చేస్ చేసుకునే పాక్ అక్కడ తనదైన శైలిలో దాడులతో విరుచుకుపడేలా ఉగ్రవాదులకు సాయం చేస్తోంది. వీలు చిక్కితే చాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఆసరా చేసుకుని మరింతగా ముందుకు వచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. అయితే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక... పరిస్థితి మారిపోయిందని చెప్పాలి. భారత్ కు సంబంధించి ఇతర ప్రధానుల మాదిరి మోదీ పాక్ పట్ల మెతక వైఖరిని అవంబించడం లేదు. స్నేహ హస్తం అంటూనే... మాట వినని పాక్ కు బుద్ధి చెప్పేందుకు సర్జికల్ స్ట్రైక్స్ కు కూడా వెనుకాడటం లేదు. అంతేకాకుండా ఇప్పుడు పాక్ కు ప్రధానిగా కొనసాగుతున్న ఇమ్రాన్ ఖాన్... మునుపటి ప్రధానుల్లా దుందుడుకు స్వభావం కలిగిన నేత కాదు. ఓ వైపు మోదీ తనదైన శైలిలో విరుచుకుపడుతుంటే... ఆ దాడి నుంచి తప్పించుకునేందుకే పాక్ కు చేత కావడం లేదు. అలాంటిది ఇప్పుడు భారత్ తన భూభాగానికి సంబంధించిన రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకుంటే... పాక్ యుద్దానికి ఎందుకు సిద్ధపడుతుంది.
ఇక్కడే ఓ మాట చెప్పుకోవాలి. అదేంటంటే... మొన్న కశ్మీర్ విభజన బిల్లు సందర్భంగా త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కూడా లాగేసుకుంటామన్న మాట బీజేపీ శిబిరం నుంచి వినిపించింది. ఈ మాట వినగానే పాక్ వెన్నులో వణుకు పుట్టిందనే చెప్పాలి. కశ్మీర్ ను విభజించి, ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి తొలగించేసి ఉగ్రవాదుల పీచమణిచే వ్యూహాన్ని చాలా పకడ్బందీగా అమలు చేసిన మోదీకి.... పీఓకేను స్వాధీనం చేసుకోవడం పెద్ద పనేమీ కాదన్న వాదన కూడా లేకపోలేదు. మోదీ తలచుకుని పీఓకేపై గురి పెడితే... పాక్ గుడ్లు తేలేయాల్సిన పరిస్థితే. ఇదే భావనతో ఉన్న పాక్... పీఓకేపై మోదీ కన్ను పడకుండా, ముందుగానే కాస్తంత హడావిడి చేస్తే సరిపోతుంది కదా అన్న భావనతోనే పాక్ ఇప్పుడు లడక్ సమీపంలో యుద్ధ సన్నాహాలంటూ లీకులు ఇస్తున్నట్లుగా సరికొత్త విశ్లేషణలు జరుగుతున్నాయి. సరిహద్దు వెంట ఉద్రిక్త పరిస్థితులను సృష్టించి ప్రపంచ దేశాలన్నీ తమ వైపే చూసేలా చేయడంతో భారత్ నుంచి పీఓకేను కాపాడుకునేందుకే పాక్ ఈ పన్నాగం వేసినట్టుగా తెలుస్తోంది.