అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. అమెరికా.. చైనాలకు ధీటుగా భారత్ అంతరిక్ష పరిశోధనలు చేపడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మన దేశ రాకెట్లతోపాటుగా ఇతర దేశాలకు చెందిన ఉప గ్రహాలను సైతం ఇస్రో నిర్ణిత కక్ష్యలోకి పెట్టిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలోనే అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో మైలురాయిని చేరేందుకు కేవలం అడుగు దూరంలో ఉంది.
ఇస్రో వేదికగా దేశంలో తొలిసారి తయారుచేసిన ప్రైవేట్ రాకెట్ ను భారత్ అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. వాతావరణ పరిస్థితులను బట్టి నవంబర్ 12 నుంచి 15 మధ్యలో ఈ రాకెట్ టేకాఫ్ కానుంది. స్కై రూట్ అనే స్పేస్ స్టార్టప్ సంస్థ 'విక్రమ్ ఎస్' అనే రాకెట్ ను తయారు చేసింది. దేశంలో ఒక ప్రైవేటు కంపెనీ తయారు చేసిన తొలి రాకెట్ గా 'విక్రమ్ ఎస్' రికార్డు సృష్టించింది.
ఈ రాకెట్ ప్రయోగానికి స్కైరూట్ సంస్థ ప్రారంభ్ అనే పేరు పెట్టింది. ఇస్రో సహకారంతో 'విక్రమ్ ఎస్' రాకెట్ ను నింగిలోకి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్కైరూట్ ఎగ్జిక్యూటివ్స్ వెల్లడించారు. వాతావరణ పరిస్థితులను బట్టి 'విక్రమ్ ఎస్' రాకెట్ ప్రయోగ తేదీని నిర్ణయిస్తామని ఆ సంస్థ సీఈవో పవన్ కుమార్ తెలిపారు.
'విక్రమ్-ఎస్' కలాం 80 అనే డిఫరెంట్ ఇంజిన్‌లతో పని చేస్తుందన్నారు. పలు దశల్లో దీనిని పరీక్షించిన తర్వాత టేకాఫ్‌కు రెడీ చేసినట్లు తెలిపారు. 'విక్రమ్ ఎస్' రాకెట్ ఇంజిన్ సైతం రెండేళ్ల పాటు పరీక్షించడం జరిగిందని స్కైరూట్ సీఈవో వెల్లడించారు. భారత్ లో తరుచూ విదేశాలకు చెందిన రాకెట్ ప్రయోగాలు చేస్తున్నందున ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్లకు డిమాండ్ నెలకొందన్నారు.
ఈ అంశం తమలాంటి ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ లకు ఊతమిస్తుందని స్కైరూట్ నిర్వాహకులు తెలిపారు. త్రీడీ ప్రింటెడ్ రాకెట్ ఇంజన్లను తయారు చేసే ప్రముఖ సంస్థల్లో తమది కూడా ఒకటని తెలిపారు. 'విక్రమ్ ఎస్' రాకెట్ ప్రయోగం తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఆర్డర్లను స్కైరూట్ దక్కించుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
2025 సంవత్సరానికి నాటికి అంతరక్షంలోకి 60వేల శాటిలైట్ లను పంపే అవకాశం ఉందన్నారు. ఇందులో ఎక్కువ శాతం ప్రైవేట్ కంపెనీలకు దక్కే అవకాశం ఉందని స్కైరూట్ సీఈఓ తెలిపారు. ఇస్రో.. ఇన్‌స్పేస్ సహకారంతో చాలా తక్కువ సమయంలోనే తమ మిషన్ సిద్దమైందన్నారు. ఈ రాకెట్ ప్రయోగంతో భారత్‌లో తొలి ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించిన ఘనత తమ సంస్థకే దక్కుతుందని స్కైరూట్ సీఈవో పవన్ కుమార్ వెల్లడించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.