జర్నలిస్ట్ లకు ఇచ్చే అక్రెడిటేషన్ మార్గదర్శకాల్లో కేంద్ర సమాచార శాఖ కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. జర్నలిస్ట్‌లు రాసే వార్తలు నకిలీవని తేలితే వాళ్లకు ఇచ్చిన అక్రెడిటేషన్ ను రద్దు చేయాలని నిర్ణయించారు. ప్రింట్ - ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఫేక్ న్యూస్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ ఓ ప్రకటనలో చెప్పింది. అయితే ఈ ప్రకటన బూమరాంగ్ కావడంతో - అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో మోడీ సర్కారు వెనక్కు తగ్గింది. `కల్పిత వార్తలకు సంబంధించిన పిఐబి పత్రికా ప్రకటనను ఉపసంహరించుకోవడమైంది` అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టీం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
తాజా ప్రకటన ప్రకారం ఏదైనా వార్త నకిలీది అన్న ఫిర్యాదు వస్తే వాటిని ప్రింట్ మీడియా అయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు - ఎలక్ట్రానిక్ మీడియా అయితే న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ కు రిఫర్ చేస్తామని సమాచార శాఖ తెలిపింది. 15 రోజుల్లో ఈ ఫిర్యాదులపై విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. విచారణ సమయంలో సదరు జర్నలిస్ట్ అక్రెడిటేషన్ సస్పెన్షన్ లో ఉంటుంది. ఒకవేళ ఈ ఏజెన్సీలు అది ఫేక్ న్యూసే అని తేలిస్తే గనక.. తొలి ఉల్లంఘన అయితే ఆరు నెలలు - రెండో ఉల్లంఘన అయితే ఏడాది - మూడో ఉల్లంఘన అయితే శాశ్వతంగా అక్రెడిటేషన్ రద్దు చేస్తామని సమాచార శాఖ స్పష్టంచేసింది.
దీనిపై దేశవ్యాప్తంగానే కాకుండా ఆయా రాష్ర్టాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే ఫేక్ న్యూస్ కు సంబంధించి సమాచార శాఖ ఇచ్చిన కొత్త మార్గదర్శకాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. ఈ ఫేక్ న్యూస్ అంశాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకే వదిలేయాలని మోడీ స్పష్టంచేశారు.ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం వద్దని - అది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందని భావించిన ప్రధాని మోదీ.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు సీఎం కేసీఆర్ సైతం ఈ పరిణామంపై ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండానే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. నిరాధార - తప్పుడు వార్తలు ప్రచురించిన - ప్రసారం చేసిన సందర్భంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే చట్టాలున్నాయని సీఎం గుర్తు చేశారు. తప్పుడు వార్తలు రాసే జర్నలిస్టుల గుర్తింపు రద్దు చేస్తామనడం దేశంలోని వేలాది మంది జర్నలిస్టులకు ఆందోళన కలిగించే అంశమని సీఎం పేర్కొన్నారు.