గుండె నిండా ధైర్యంతో... యూరీ ఉగ్రదాడికి ప్రతీకారంతో భారత సైనికులు తమ దేశంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను తుదముట్టించిన ఘటనతో రగిలిపోతున్న పాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మన సైన్యమే కాదు మన క్రీడాకారులూ పాక్ ను ఇదే సమయంలో చిత్తుచిత్తుగా ఓడించారు. హాకీలో పాక్ జట్టును చిత్తు చిత్తు చేసి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ అండర్-18 హాకీ టోర్నీలో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆది నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో 3-1 తేడాతో భారత్ కుర్రాళ్లు పాకిస్థాన్ పై ఘన విజయం సాధించారు.
ఓ వైపు ఇండియన్ ఆర్మీ సరిహద్దుల్లో కదం తొక్కుతుంటే మన హాకీ కుర్రాళ్లు కూడా అంతే స్థాయిలో మైదానంలో కదం తొక్కి పాక్ జట్టు పని పట్టారు. కరెక్టుగా ఆర్మీ అటాక్సు జరుగుతున్న రోజుల్లో హాకీ ప్లేయర్లు చెలరేగడంతో సోషల్ మీడియాలో ఈ విజయానికి విపరీతమైన ప్రశంసలు కురుస్తున్నాయి. అండర్ 18 హాకీ కుర్రాళ్లను సైనికులతో పోలుస్తూ పోస్టులు షేర్ అవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/