చైనాపై భారత్ పెద్ద ప్లాన్..

Update: 2022-12-26 03:57 GMT
శత్రువు కుట్రలు కుతంత్రాలు తెలిసి కూడా గమ్మున ఉండడం అది మన చేతికానితనమే. శత్రువు కంటే ఆర్థిక స్థోమత లేకున్నా ఆ మానసిక స్థైర్యం ఉండాలి. అందుకే భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుతోంది భారత ప్రభుత్వం. పొరుగు దేశం చైనాతో భారత్ కు ఎప్పటికైనా ముప్పే. సరిహద్దుల విషయంలో డ్రాగన్ దేశం భారత్ ను పదే పదే రెచ్చగొడుతోంది. సంయమనం పాటిస్తున్న భారత్ ను దొంగ దెబ్బ తీస్తోంది.  తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని తహాంగ్ సెక్టర్ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. తవాంగ్ సెక్టార్ లో చైనా సైనికులు చొరబడేందుకు యత్నించగా భారత్ సైనికులు అడ్డుకున్నారు. అయితే ఈ ఘర్షణలో  భారతీయ సైనికుల కంటే చైనా సైన్యమే ఎక్కువగా గాయపడ్డారు. ఈ క్రమంలో భారత్ ఇక ఓపిక పట్టే ప్రసక్తే లేదని తెలుస్తోంది.అవసరమైతే చైనాకు ధీటుగా ఆయుధాలు మోహరించడానికి  సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పెద్ద ప్లానే వేసినట్లు సమాచారం.  

గాల్వామా లోయ ఘటన తరువాత అప్రమత్తమైన భారత్  రక్షణ రంగానికి అధిక నిధులు కేటాయిస్తోంది. ముఖ్యంగా చైనా లాంటి దేశాలను ఎదుర్కొనేందుకు  అవసరమైన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. రష్యా, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి అత్యాధునిక మిషెల్స్ ను ఇప్పటికే సమకూర్చుకుంది.  ఈ క్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలో నాలుగోస్థానంలో నిలిచింది. అమెరికా, రష్యా, చైనా తరువాత అంత స్థాయిలో ఆయుధాలు భారత్ లోనే ఉండడం విశేషం. వైమానిక రంగంతో పాటు ఆర్మీ, నేవీలు కూడా  శత్రువుల జాడను పసిగట్టే విధంగా సదుపాయాలు కల్పించుకుంటున్నారు.  

ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ కు ప్రధాన శత్రువు చైనా, పాకిస్థాన్ లు. ఈ దేశాలతో ఎప్పటికైనా ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ గత ఐదేళ్లలో అత్యధిక ఆయుధాలు కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారత్ లో ఆర్మీ వద్ద అమెరికన్ సిగ్ సార్ 716 అసాల్ట్ రైఫిళ్లు, స్విస్ ఎంపీ9 పిస్టల్స్ ఉన్నాయి.

అలాగే ఏకే 47, ఏకే 56 కంటే పవర్ ఫుల్ ఆయుధాలున్నాయి. అర్జున్ MBT యుద్ధ ట్యాంక్, T-90 భీష్మ, ఆకాశ్, బ్రహ్మోస్, పృథ్వీ, అగ్ని, త్రిషల్, నాగ్ అనే క్షిపణులు ఉన్నాయి. ఆకాశ్ ను పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు. ఇది ఉన్న చోట నుంచి 30 కిలోమీటర్ల దూంలో ఉన్న వాటిని నిరోధించగలదు. బ్రహ్మోస్ గురించి పరిశీలిస్తే 290 కిలోమీటర్ల దూరం ఉన్న పక్క దేశాల స్థావరాలను ఈజీగా ధ్వంసం చేయగలదు. వీటితో పాటు 12 వేల 800 ఫిరంగులు, బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి.

భారత్ లోప్రస్తుతం 25 లక్షలకు పైగానే సైనికులు ఉన్నారు. రిజర్వ్ సైన్యం 12 లక్షలు. 15 వేల మంది యుద్ధ విద్యల్లో ఆరితేరిన వారున్నారు. ఆర్మీ మొత్తంలో 34 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్ లో కొన్ని బ్రిగేడ్ లు ఉంటాయి. ఇందులో 4 నుంచి 5 వేల మంది సైనికులు ఉంటారు. కల్నల్ ఆధ్వర్యంలో నిర్వహించే బెటాలియన్ లో 900 కంటే ఎక్కువ మంది సైనికులు ఉంటారు. చైనా కంటే అత్యాధునిక ఆయుధాలు భారత్ అమెరికా నుంచి తెప్పించుకోగలిగింది. సిగ్ సాగర్ రైఫిళ్లను సైన్యం కోసం ప్రత్యేకంగా తెప్పించారు. అలాగే యుద్ధ ట్యాంకులు 4,614, సాయుధ వాహనాలు 12 వేలు, స్వీయ చోదక ఫిరంగి దళాలు 100 ఉన్నాయి.

మొన్నటి వరకు సంయమనం పాటించిన భారత్ కు ఓపిక నశించినట్లు తెలుస్తోంది. అహింసావాద సిద్ధాంతాన్నిపక్కనబెట్టి చైనాతో ఢీ అంటే ఢీ అనడానికి రెడీ అవుతోంది. చైనానే కాకుండా పాకిస్తాన్ దేశం విషయంలోనూ కాస్త కఠినంగానే వ్యవహరించాలని అనుకుంటోంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో మోహరించే 'ప్రచండ' హెలీక్యాప్టర్లను డిజైన్ చేసింది. వీటిని ఇప్పటికే లడఖ్ లో పరీక్షించారు. ఇవి చైనా డ్రోన్లతో పాటు ఎయిర్ టు ఎయిర్ మిషన్ మిసైల్స్ ను అలవోకగా కూల్చగలవు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News