కర్ణాటకలో అణు పరీక్షలు నిజమేనా?

Update: 2015-12-18 08:16 GMT
ఇండియా రహస్యంగా అణుపరిశోధనలు చేస్తుందా... దక్షిణ భారతదేశంలో మూడేళ్లుగా దీనికి సంబంధించిన కార్యకలాపాలు సాగుతున్నాయా...? ఇంతవరకు భారత్ లో ఎక్కడా కొంచెం కూడా బయటకు పొక్కని ఈ విషయాన్ని అంతర్జాతీయ పత్రిక ఒకటి తాజాగా బయటపెట్టడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పాకిస్థాన్ ను అస్థిరపరిచేందు కోసం భారత్ అత్యంత రహస్యంగా కర్ణాటకలో తన అణుకార్యక్రమం సాగిస్తోందని ఆ పత్రిక ఆరోపించింది.

కర్ణాటక దక్షిణ ప్రాంతంలోని ఛెల్లకెరిలోని గిరిజన ప్రాంతంలో అత్యంత రహస్యంగా ప్రత్యేక అణు పరిశోధనలు సాగుతున్నాయట. ''ఫారిన్ పాలసీ'' అనే అంతర్జాతీయ పత్రిక ఈ విషయం తాజాగా బయటపెట్టింది. పౌర అవసరాల కోసం అణు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత్ అక్కడ పరిశోధనలకు సాగిస్తున్నదని ఆ పత్రిక వివరించింది. ఛెల్లకెరి వద్ద దీనికోసం 212లో గిరిజనులకు చెందిన కొంత ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ ఏడాది నుంచే ప్రాజెక్టు ప్రారంభించిందని చెబుతోంది. ఇందులో వాస్తవాలు, అవాస్తవాలు ఎలా ఉన్నా... ఇదే కనుక నిజమైతే అమెరికా వంటి దేశాలు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి. మరోవైపు  అణు పరిశోధనలకు సంబంధించిన అణువంత పని మొదలుపెట్టినా వాసన పసిగట్టే అమెరికా ముక్కుకు ఇది ఇంతవరకు తెలియదా అన్నదీ అనుమానమే.
Tags:    

Similar News