ప్రవాస భారతీయులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. భారత పాస్ పోర్ట్ కలిగి ఉన్నఎన్ ఆర్ ఐలు తిరిగి స్వదేశానికి రాగానే వారికి ఆధార్ కార్డులు ఇస్తామని ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఆధార్ పొందేందుకు 180 రోజులు వేచిచూడాలనే నిబంధన ఉన్నప్పటికీ - ఆ నిబంధనతో పనిలేకుండానే వారికి ఆధార్ కార్డులు ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఇంతవరకూ భారతదేశానికి దౌత్య కార్యాలయాలు లేని చోట్ల వాటిని ఏర్పాటు చేయనున్నామని ఆమె తెలిపారు. అయితే ఇందులో భాగంగా ఆఫ్రికా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 18 కొత్త దౌత్య కార్యాలయాలు తెరవనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు.
కాగా ఆధార్ కార్డును స్వచ్ఛందంగా వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన ‘ఆధార్ సవరణ బిల్లు 2019’ బిల్లుకు కూడా లోక్‌సభ ఇటీవల మూజువాణి ఓటులో ఆమోద ముద్ర వేసింది. ఇకపై గుర్తింపు కార్డు అవసరం ఉన్నచోట ఆధార్ కార్డు ఇవ్వాలా? వద్దా? అన్నది వినియోగదారుడి ఇష్టమని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇకపై ఆధార్ లేనంత మాత్రాన ఎలాంటి సేవలు - ప్రజా ప్రయోజన పథకాలను తిరస్కరించే అధికారం ఏ సంస్థకూ లేదన్నారు. ఆధార్ కార్డులో ఒక మనిషికి సంబంధించి పూర్తి సమాచారం ఉండదని - పేరు - తండ్రి పేరు - అడ్రస్ మాత్రమే ఉంటాయని - కులమతాలు - ఆరోగ్య వివరాలు - ఇతర వివరాలు ఆ డేటాలో ఉండవని చెప్పారు. మన దేశంలో ఆధార్ సమాచారం పూర్తి సురక్షితంగా ఉందన్నారు.
ప్రజల డేటా రక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసకుంటోందని - త్వరలోనే డేటా రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు రవిశంకర్ తెలిపారు. ఆధార్ డేటాను ఎవరు కోరినా శిక్షార్హులు అవుతారని - ప్రైవేటు సంస్థలేవైనా ఆధార్ డేటాను సేవ్ చేసుకుంటే రూ.కోటి జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష పడుతుందని హెచ్చరించారు. కేంద్రమంత్రిగా తాను ఆధార్ డేటాను కోరినా మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశముందన్నారు. ప్రస్తుతం 123 కోట్ల మంది ఆధార్‌ను వాడుతున్నారనీ - దీనివల్ల కేంద్రానికి రూ.1.41 లక్షల కోట్లు మిగిలిందని వెల్లడించారు.