ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 86,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,12,585కి చేరింది. వైరస్‌బారినపడి ఇప్పటి వరకు 98,678 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 85,376గా నమోదు అయ్యింది. ఇప్పటి వరకు 52,73,201మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 9,40,705 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 83.53 శాతంగా నమోదైంది. మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.56 శాతానికి తగ్గింది. ఇక దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 14,23,052 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా.. ఇప్పటి వరకు మొత్తం 7,56,19,781 పరీక్షలు చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ జారీచేసింది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,214 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 305 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో1,93,600 కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ ఎనిమిది మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 1,135కు చేరింది. ఈ రోజు 2,474 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం1,63,407 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 29,058 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 23,702 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు 0.58 శాతంగా ఉండగా రికవరీ రేటు 84.40 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 54,443 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 30,50,444 పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వివరించింది.
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా మరో 6,133 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 983 కేసులు నమోదు కాగా... అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 216 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 6,93,484కి పెరిగింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 48 మంది మరణించారు. దీంతో, ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 5,828కి పెరిగింది. మరోవైపు 24 గంటల్లో 7,075 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,445 యాక్టివ్ కేసులు ఉన్నాయి.