వ్యాక్సిన్ ఖర్చు భారం మన దేశం మీద ఎంతో తెలుసా?

Update: 2020-12-17 14:30 GMT
కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది. ఇప్పటికే పలు దేశాల్లో దీన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఈ నెల 25న కరోనా టీకాను దేశంలో విడుదల చేయనున్నారు. ఆ వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇందుకోసం భారీగా ప్లాన్ చేస్తోంది. డిసెంబరు 25 నుంచి ఏపీ వ్యాప్తంగా టీకాలు వేస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేయటం తెలిసిందే. ఇంతకీ.. వ్యాక్సిన్ కారణంగా దేశ ఖజానా మీద పడే భారం ఎంత? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

మిగిలిన దేశాల మాదిరి కాకుండా భారత్.. ఒకేసారి మూడు నాలుగు కంపెనీల వ్యాక్సిన్లను ప్రజలకు అందించాలని భావిస్తున్నారు. దేశ జనాభా అధికంగా ఉండటంతో.. మిగిలిన దేశాల మాదిరి కాకుండా.. భారీ ఎత్తున వ్యాక్సిన్లను సమీకరించాల్సి ఉంటుంది. రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించటం లక్ష్యమని చెబుతున్నారు. ఆస్ట్రాజెనికా.. స్పూత్నిక్.. జైడస్ క్యాడిలాతో పాటు భారత్ బయోటెక్ నుంచి వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని భావిస్తున్నారు.

ఖర్చు విషయానికి వస్తే.. దాదాపు రూ.10 నుంచి రూ.14వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కరోనా ముప్పు అధికంగా ఉన్న వారికి తొలిదశలో వ్యాక్సిన్ ఇస్తారు. ఇందుకోసం దాదాపు 60 కోట్ల డోసుల్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోని పలు దేశాలకు ప్రపంచ దేశాల సమాఖ్య టీకాల్ని సరఫరా చేయనుంది. దీని ద్వారా.. భారత్ కు 19 నుంచి 25 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులు రానున్నాయి.

అదనపు వ్యాక్సిన్ కోసం మరో రూ.10వేల కోట్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇదంతా చూసినప్పుడు వ్యాక్సిన్ల కోసం రూ.25వేల కోట్లు..రవాణా కోసం రూ.500 కోట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన లెక్కల్ని ఇప్పటికే ఆర్థిక శాఖలు స్పందించాల్సి ఉంది.
Tags:    

Similar News