సైబర్ మోసం .. ప్రపంచంలో ఎక్కువుగా వినిపించే పేరు. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు కూడా సైబర్ మోసగాళ్ల చేతుల్లో చిక్కి , మోసపోతున్నారు. పోలీసులు ఈ తరహా మోసగాళ్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నప్పటికీ కూడా , రోజుకో కొత్త పంథాను ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుకుని ఇండియా ప్రధాని మోడీ సామాజిక మాధ్యమాలు హ్యాక్ అయిన విషయం తెలిసిందే. భవిష్యత్ లో ‘ఫేస్ టు ఫేస్’ యుద్ధాలు ఉండవని.. సైబర్ దాడులే ఎవరి శక్తి ఎంతని నిర్ణయిస్తాయని రక్షణ రంగ నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు.
ఇక, మన పొరుగు దేశం చైనా సైబర్ వింగ్ కోసం ప్రత్యేకంగా నియామకాలు చేపట్టిందని కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సైబర్ సామర్థ్యాల వియయంలో ఏ దేశం సత్తా ఎంత ఉందనే దానిపై ‘హార్డర్డ్ కెనెడీ స్కూల్ కు చెందిన బెల్ ఫేర్ సెంటర్ ఫైర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ సర్వే చేసి ఆ వివరాలు ప్రకటించింది.
ఆ సర్వే .. టాప్ 10లో అమెరికా నెంబర్ వన్ కాగా .. చైనా, ఇంగ్లాడ్, రష్యా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కొనసాగుతున్నాయి. ఇండియా సైబర్ సెక్యూరిటీ సామర్థ్యం లో 21 స్థానంలో నిలిచింది. అయితే, భారత సైబర్ భద్రతా వ్యూహం కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా విడుదలైన నివేదిక అందుకు మార్గం సుగమం చేస్తుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.