జర్నలిస్టుల హత్యల్లో పాక్ తో పోటీ పడుతున్న భారత్
కత్తి కంటే కలం గొప్పదన్న మాట ఎలా ఉన్నా.. దాని పర్యవసానంగా అక్షర యోధుల్ని బలి తీసుకుంటుంది. కలంపై కత్తిపోటు అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. నిజాల్ని బయటకు తీసుకొచ్చే జర్నలిస్టుల్ని అంతం చేయటానికి వెనుకాడని వైనం ఇటీవల కాలంలో ఎక్కువైంది. తాజాగా ఇదే విషయాన్ని ఒక రిపోర్టు వెల్లడించింది. షాకింగ్ నిజం ఏమంటే.. హత్యకు గురి అవుతున్న జర్నలిస్టుల్లో పాక్ కంటే దారుణమైన రికార్డు భారత్ పేరుతో ఉండటం. 2020లో ప్రపంచ వ్యాప్తంగా 65 మంది జర్నలిస్టుల్ని చంపేసిన వైనాన్ని అంతర్జాతయ జర్నలిస్టుల సమాఖ్య వెల్లడించింది.
2020 కంటే ముందు సంవత్సరాలతో పోలిస్తే.. గత ఏడాది జర్నలిస్టులు అధికంగా హత్యకు గురైనట్లుగా తేలింది. ప్రపంచ వ్యాప్తంగా 16దేశాల్లో జర్నలిస్టులుహత్యకు గురైతే.. అందులో భారత్ రికార్డు కూడా చెత్తగా ఉందని చెప్పాలి. 1990లో అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్యనుఏర్పాటు చేసిన సంవత్సరంలో 65 మంది మరణించగా.. 2020లో అంతే మంది హత్యకు గురి కావటం గమనార్హం.
హత్యలతో పాటు.. ప్రభుత్వ చర్యల కారణంగా పెద్ద ఎత్తున జర్నలిస్టులు జైళ్లలో మగ్గుతున్నారు. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 200 మంది జర్నలిస్టులు జైలుపాలు అయినట్లుగా తెలుస్తోంది. 1990 నుంచి ఇప్పటివరకు 2680 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. గత ఏడాది విషయాన్ని తీసుకుంటే మెక్సికోలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారు. తర్వాతి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఈ నివేదికలో ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. స్వేచ్ఛ అంతంత మాత్రంగా ఉండే పాకిస్తాన్ లో హత్యకు గురైన జర్నలిస్టులకు దగ్గరగా భారత్ ఉండటం.
2020లో పాకిస్తాన్ లో తొమ్మిది మంది జర్నలిస్టులు హత్యకు గురైతే.. భారత్ లో ఎనిమిది మంది హత్యల కారణంగా ప్రాణాలు విడిచారు. ప్రపంచ వ్యాప్తంగా హత్యకు గురైన జర్నలిస్టుల్లో భారత్ నాలుగో స్థానంలో నిలవటం గమనార్హం. భారత్ తర్వాత ఫిలిప్సీన్స్ (4).. సిరియా (4).. నైజీరియా (3).. యెమెన్ (3).. ఇరాక్ (2)..సొమాలియా (2).. బంగ్లాదేశ్ (2).. కామెరూన్ 92).. హోండూరస (2).. పరాగ్వే (2).. రష్యా (2).. స్వీడన్ (2) బలైనట్లుగా ఐఎఫ్ జే వెల్లడించింది.