కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయంతో వణికిపోయేలా చేస్తుంది. చైనాలో బయటపడిన వచ్చిన ఈ మహమ్మారి ఆ తరువాత ఒక్కొక్క దేశం వ్యాప్తి చెందుతూ ఇప్పుడు ప్రపంచం మొత్తం విస్తరించింది. ఇక మనదేశంలో కూడా ఇప్పుడు చాపకింద నీరులా విస్తరిస్తూ పోతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో కరోనా కేసుల నమోదులో 20 వేలకు పైగా కేసులతో ఇండియా 17 వ స్థానంలో ఉందని తెలుస్తోంది.
ముఖ్యంగా భారతదేశంలో మహారాష్ట్ర - రాజస్థాన్ - పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే ఈ రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అలాగే కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు దేశంలో 645 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 20,178కు చేరుకోగా.. గత 24 గంటల్లో కొత్తగా 1493 కేసులు నమోదయ్యాయి. అయితే ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం.. బుధవారం నాటికి ఇది 19,984 కేసులని - 640 మంది మృతి చెందారని నివేదిక అందింది. లాక్ డౌన్ పొడిగించిన ఫలితంగా ఇతర దేశాల కన్నా ఇండియా కరోనా అదుపులో చాలా ముందంజలో ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.