కరోనా వైరస్ దేశంలో 3వ స్టేజీలోకి ప్రవేశిందని కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ కన్వీనర్ గిరిధర్ గ్యానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా గుబులు రేపుతున్నాయి.
కరోనా వ్యాప్తిలో 3వ దశ చాలా డేంజర్ అంటారు. ఇటలీలో మూడో దశలో నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు వేల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. భారత్ ముందే మేలుకొని లాక్ డౌన్ ప్రకటించడంతో ఊరట లభించింది.
కరోనా వ్యాప్తిలో సాధారణగా మూడు దశలుంటాయి. ఒకటి.. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ తేలడం.. రెండోదశ.. విదేశాల నుంచి వచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారు కలిసిన వారికి సోకడం.. ఇక మూడో దశలో కమ్యూనిటీ వ్యాప్తి చెందడం.. అంటే సాధారణ జనాలందరికీ వ్యాపించడం.. ఎంతమందికి ఇది సోకుతుందని అంచనావేయలేనంత దారుణంగా పరిస్థితి ఉంటుంది.
ఇప్పుడు భారత్ కూడా మూడో దశలోకి చేరిందని టాస్క్ ఫోర్స్ కన్వీనర్ గిరిధర్ గ్యానీ సంచలన విషయం బయటపెట్టారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 5 నుంచి 10 రోజులు కరోనాను నియంత్రించడం కీలకమని.. ఈ పీరియడ్ లో జనాలు గుంపులుగా తిరిగితే వినాశనమేనని తెలిపారు. ఇప్పుడు చాలా మంది లక్షణాలు బయటపడని వారికి వైరస్ బయటపడుతుందని.. రాబోయే కొద్దివారాల్లో వైరస్ ఎప్పుడైనా విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు.
భారత్ లో ఇప్పటికీ సరైనన్నీ ఆస్పత్రులు - వైద్య సిబ్బంది... టెస్టింగ్ కిట్స్ కూడా లేవని.. సో అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించడమే మేలని ఆయన హెచ్చరించారు. మెడికల్ చివరి సంవత్సరం విద్యార్థులను - వైద్య కళాశాలను కరోనా ఆస్పత్రులుగా మార్చాలని ప్రధాని మోడీకి సూచించానని తెలిపారు.