ఆ విషయంలో చైనాను వెనక్కి నెట్టిన భారత్..!

Update: 2022-11-04 05:33 GMT
భారత్ అభివృద్ధిలో దూసుకెళుతుందో లేదో తెలియదు గానీ వాయు కాలుష్యంలో మాత్రం అగ్ర స్థానాన్ని దక్కించుకుందని డబ్ల్యూహెచ్ఓ నివేదికలో వెల్లడి కావడం విశేషం. సింగపూర్ చెందిన ఐక్యూఎయిర్ నివేదిక ప్రకారంగా ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాలు 15 ఉండగా భారత్ లోనే  ఏకంగా 12 ఉన్నాయని పేర్కొనడం ఆందోళనను రేపుతోంది.

2021 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ నివేదికను పరిశీలించినట్లయితే ఎయిర్ పోల్యూషన్ విషయంలో భారత్ డేంజర్ జోన్లో ఉన్నట్లుగా అర్థమవుతోంది. పారిశ్రామికంగా అభివృద్ధిలో మనకన్నా ముందున్న చైనా కంటే భారత్ లోనే వాయు కాలుష్యం ఎక్కువగా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

ఐక్యూఎయిర్ సర్వే ప్రకారంగా ప్రపంచంలోని 99శాతం మంది ప్రజలు డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు మించి గాలి నాణ్యత ఉన్న ప్రదేశాల్లో నివసిస్తున్నారని పేర్కొంది. భారత్ లోని ఏ నగరం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అందుకోలేక అధ్వాన్నంగా ఉన్నట్లు తేలింది. గత మూడేళ్లలో భారత్ వాయి కాలుష్యం మరింత పెరిగినట్లు ఈ రిపోర్టులో వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత కాలుష్య నగరాల జాబితాను ఎర్త్.ఆర్గ్ సేకరించింది. దీని ప్రకారం టాప్ 15 లో 12 భారత నగరాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో తొలి స్థానంలో రాజస్థాన్ కు చెందిన భీవాండి  ఉండగా.. యూపీలోని ఘజియాబాద్ రెండో స్థానంలో ఉంది.

చైనాలోని హోటన్ నగరం మూడో స్థానంలో.. ఢిల్లీ (ఇండియా) నాలుగో స్థానంలో.. జౌన్‌పూర్ (ఇండియా) ఐదోస్థానంలో ఉన్నాయి. పాకిస్థానోని ఫైస్లాబాద్ ఆరో స్థానంలో.. నోయిడా (ఇండియా) ఏడో స్థానంలో.. బహవల్పూర్ (ఇండియా) ఎనిమదవ స్థానంలో ఉన్నాయి. పేశ్వర్ (ఇండియా) తొమ్మిది స్థానంలో.. బాగ్‌పట్ (ఇండియా) పదో స్థానాన్ని దక్కించుకున్నాయి.

హిసార్ (ఇండియా) 11వ స్థానంలో ఫరీదాబాద్(ఇండియా) 12వ స్థానంలో.. గ్రేటర్ నోయిడా (ఇండియా) 13వ స్థానంలో.. రోహ్తక్ (ఇండియా) 14వ స్థానంలో.. లాహోర్(పాకిస్తాన్) 15వ స్థానంలో కొనసాగుతున్నట్లు ఎర్త్.ఆర్గ్ సర్వే పేర్కొంది.

ఈ నగరాల్లో వాయి కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలతోపాటు ఆమ్ల వర్షాలు, పంట దిగుబడి తగ్గి పునరుత్పత్తి వైఫల్యం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి వాయి కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రతీఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News