భారతీయులు విదేశాలకు పయనమవుతున్నారు. అక్కడ ఉద్యోగాలు, ఉపాధి పేరుతో విస్తరించేందకు సొంతదేశాన్ని విడిచిపెడుతున్నారు. ఇక్కడే పుట్టి.. సగం జీవితాన్ని అనుభవించిన కొందరు విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతున్నారు. అందుకోసం భారత పౌరసత్వాన్నైనా వదులుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. విదేశాల పౌరసత్వం కోసం ఇండియన్ సిటిషన్ షిప్ వదులు కుంటున్నారు.
చదువు.. ఉద్యోగం.. వ్యాపారం కోసం.. ఇతర దేశాలకు వెళ్లే ఇండియన్స్ చాలా మందే ఉంటారు. అయితే కొంత కాలం పాటు అక్కడుండి తిరిగి వచ్చేవారు ఉండగా.. మరి కొందరు మాత్రం అక్కడే సెటిల్ అవుతారు. ఎక్కువగా వ్యాపారం చేసేవారు విదేశాల పౌరసత్వం తీసుకొని ఇక్కడే జీవితాన్ని గడుపుతారు. భారత పౌరసత్వాన్ని వదులుకునైనా విదేశాలకు పయనమయ్యేవారి సంఖ్య పెరుగుతోంది. గత ఐదేళ్లలో 6 లక్షల మంది ఎన్నారైలు ఇండియన్ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. ఇండియన్ సిటిజన్ షిప్ వదులుకోవడానికి పెద్ద కారణమే ఉంది.
2020 సంవత్సంలో గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ చేసిన రివ్యూలో అనేక విషయాలను తెలిపింది. 2020 ఒక్క సంవత్సరంలోనే భారత్ నుంచి 7 వేల మంది సంపన్నులు ఇతర దేశాలకు తరలిపోయారు. ఒక దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లే వారిలో మనకంటే చైనా ముందంజలో ఉంది. ఈ సంవవత్సంలో చైనా నుంచి 16 వేల మంది విదేశాలకు తరలిపోయారు. అయితే విదేశాల్లోకి వెళ్లి అక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని గడపాలనుకునే వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. భారత్ లో కంటే ఇతర దేశాల్లో తమ వ్యాపారం వృద్ధి చెందుతుని భావించి వీరంతా ఇతర దేశాలకు పయనమవుతున్నారు.
అయితే ఇతర దేశాల్లో శాశ్వత గుర్తింపు పొందితే మనదేశంలో పౌరసత్వాన్ని వదలుకోవాలి. రెండు దేశాల్లో నివాస గుర్తింపు ఉండాలంటే కుదరదు. దీంతో విదేశాల్లో పౌరసత్వం కోసం భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. అయితే పెట్టిన దేశంపై మమకారం ఉంటుందని భావించే వారికి మరో మార్గం ఉంది. ఇతర దేశాల్లో సెటిల్ అయి గుర్తింపు పొందిన వారు మన దేశంలో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందే అవకాశం ఉంది. దీని ద్వారా ఇతర దేశాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మన దేశ పౌరసత్వాన్ని కాపాడుకోవచ్చు.
అమెరికాలో 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కొత్తగా పౌరసత్వం పొందిన వారు ఎక్కువగా ఉన్న తొలి 5 దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికా అంతర్గత భద్రతా విభాగం గణాంకాల ప్రకారం.. ఈ త్రైమాసికంలో మొత్తం 1,97,148 మందికి పౌరసత్వం ఇవ్వగా.. అందులో ఈ 5 దేశాలకు చెందినవారే 34 శాతం ఉన్నారు. వీరిలో అత్యధికంగా మెక్సికో నుంచి 24508మంది ఉండగా.. ఆ తర్వాత భారత్ నుంచి 12928 మంది ఉన్నారు. ఫిలిప్పీన్స్ 11316, క్యూబా 10689, డొమినికన్ రిపబ్లిక్ 7046 లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
2021లోనూ తొలి త్రైమాసికంలో మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాల్లో మెక్సికో, భారత్ లు ముందంజలో ఉండగా.. క్యూబా , ఫిలిప్పీన్స్, చైనాలు తర్వాతి వరుసలో నిలిచాయి.