నాలుగేళ్లకోసారి పుట్ బాల్ వరల్డ్ కప్ పోటీలు అట్టహాసంగా జరుగడం ఆనవాయితీగా వస్తోంది. పుట్ బాల్ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఈ ఆటకు ఉన్న క్రేజ్ దృష్ట్యా సాకర్ సమరం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు.
స్టేడియంలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగే ఫుట్ బాల్ మ్యాచులను వీక్షించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. దీంతో పుట్ బాల్ మ్యాచ్ టికెట్లన్నీ కూడా హాట్ కేకుల్లా అమ్ముడు పోతుంటాయి. సాకర్ వరల్డ్ కప్ ను ప్రత్యక్షంగా స్టేడియాలకు వెళ్లలేని అభిమానులు టీవీలో ప్రసారమయ్యే లైవ్ షో తిలకిస్తూ సంతోషిస్తుంటారు.
2022 సంవత్సరంలో ఫిపా వరల్డ్ కప్ కు కతార్ వేదికగా మారింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పుట్ బాల్ వరల్డ్ కప్ పోటీలు డిసెంబర్ 18తో ముగియనున్నాయి. 2022 ఫిఫా వరల్డ్ కప్ ను దక్కించుకునేందుకు మొత్తం 32 జట్లు పోటీ పడుతున్నాయి. ఐదు గ్రూపులుగా ఫిపా జట్లుగా విడిపోయి పోటీ పడనున్నాయి. కతార్ లోని 8 స్టేడియాల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు.
2018లో జరిగిన ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీలను 400 కోట్ల మంది వీక్షించారు. ఇప్పుడు ఆ సంఖ్య మరో వంద కోట్లకు పైగా పెరుగుతుందని నిర్వాహాకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈవెంట్ కోసం ఎదురు చూస్తుంటే భారత్ లో మాత్రం అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ఈ ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో భారత్ ఒక్కసారి కూడా పాల్గొనకపోవడమే ఇందుకు ప్రధానమని తెలుస్తోంది. అయితే 72 ఏళ్ల క్రితం అంటే 1950లో బ్రెజిల్ లో జరిగిన ప్రపంచ కప్ పోటీలకు భారత్ కు అవకాశం లభించింది. అయితే నాడు ఆ ఛాన్స్ భారత్ ఏమాత్రం వినియోగించుకోలేదనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.
రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946 లలో ఫుట్ బాల్ ప్రపంచ కప్ పోటీలు జరుగలేదు. 1950లో తిరిగి ప్రపంచ కప్ నిర్వహించేందుకు బ్రెజిల్ రంగం సిద్ధం చేసింది. ఈ టోర్నీ క్వాలిఫైయింగ్ మ్యాచులు ఆడేందుకు 33 దేశాలు అంగీకరించాయి. క్వాలిఫైయింగ్ గ్రూప్ 10లో బర్మా.. ఫిలిప్పీన్స్‌తోపాటు భారత్‌కు చోటు దక్కింది.
అయితే బర్మా.. ఫిలిప్పీన్స్ తమ పేర్లను వెనక్కి తీసుకున్నాయి. దీంతో భారత్ ఆడకుండానే క్వాలిఫైయింగ్ రౌండ్లో ముందుకెళ్లింది. అయితే టోర్నమెంట్‌లో చివరి రౌండ్ డ్రా ముగిసింది. పూల్-3లో స్వీడన్.. ఇటలీ.. పరాగ్వేతోపాటు భారత్ చోటు దక్కింది. అయితే నాటి పరాగ్వే.. ఇటలీ జట్లు భారత్ తో పోలిస్తే బలహీనంగా ఉన్నాయి. ఈ రౌండ్ లో భారత్ ఆడితే కనీసం రెండో జట్టుగా నైనా పోటీలకు అర్హత సాధించేదనే వాదనలున్నాయి.
అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ భారత్ ఆ మ్యాచులు ఆడకుండానే వెనుదిరింది. దీంతో భారత ఫుట్ బాల్ టీం ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లయింది. నాటి నుంచి ఇప్పటి వరకు మన దేశం ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీకి ఆడకపోతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.