దేశం ఆర్థికంగా మందగమనంలోకి పడిపోతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. భారతీయులు కాస్త డబ్బులు చేతిలో ఉన్నప్పుడు కార్లు, బైకులు కొనుగోలుకు మొగ్గుచూపే రోజులు ఇవి. ప్రతి ఇంటికీ బైకులు తప్పనిసరిగా మారాయి. ఉద్యోగాలు చేసే వాళ్లు సొంత కారు కొనడాన్ని డ్రీమ్ గా ఫీలయ్యే దేశం మనది. ఈ తరహా వాతావరణంలో గత కొన్నేళ్లలో దేశ వ్యాప్తంగా కార్ల - బైకుల అమ్మకాలు భారీ స్థాయిలో సాగాయి.
అయితే గత కొంతకాలంలో మోటార్ వాహనాల కొనుగోళ్లు భారీగా తగ్గుముఖం పట్టింది. దేశీయంగా ప్రజల ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం అవుతోంది. గత ఏడాది కాలంలోనే ఎంతలా మార్పు వచ్చిందంటే..కిందటి ఏడాది ఆగస్టు కన్నా ఈ ఏడాది ఆగస్టులో అమ్ముడైన కార్ల సంఖ్య దాదాపు లక్ష తక్కువగా ఉంది!
గత ఏడాది ఆగస్టులో దాదాపు రెండు లక్షలా ఎనభై వేల స్థాయిలో కార్లు అమ్ముడు పోగా, ఈ ఏడాది ఆగస్టులో లక్షా తొంభై వేల చిల్లర కార్లు మాత్రమే అమ్ముడయ్యాయని నివేదికలు చెబుతూ ఉన్నాయి.తేడా దాదాపు తొంభై వేల వరకూ ఉంది. అమ్ముడయ్యేదే మూడు లక్షల కార్లు, అందులో ఏకంగా లక్ష కార్ల అమ్మకం తగ్గిపోయిందంటే..పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కార్ల అమ్మకం ఈ స్థాయిలో పడిపోవడానికి జీఎస్టీ కూడా ఒక కారణం అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కార్లను ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ పరిధిలో ఉంచారని, వాటిని పద్దెనిమిది శాతం పరిధిలోకి తీసుకొస్తే కొనుగోళ్లు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయట. అయితే అలా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం భారీగా పడిపోతుందని..కార్ల పెరుగుదల పెరిగినా ఆదాయం మాత్రం ఇప్పటికన్నా చాలా తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తోందట.