ఆ.. మనకెందుకులే అనుకోవడంలో ప్రపంచంలో భారతీయుల కంటే ఇంకెవవరూ ముందుండరట. తమ చుట్టూ ఏం జరుగుతోంది... మన దేశం పరిస్థితి ఏంటి వంటి కనీస నాలెడ్జి కూడా పెంచుకోరని తాజా అధ్యయనాల్లో తేలింది. ఇప్సాస్ మోరీ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఈ సంగతి తేలింది. మనవాళ్లూ దేశం గురించి అస్సలు పట్టించుకోరట. ఈ విషయంలో మెక్సికన్లూ మనతో పోటీ పడుతున్నారు. గత ఏడాది నిర్లక్ష్యంలో మెక్సికన్లు టాప్ లో ఉండగా మనం రెండో డస్థానంలో ఉండేవాళ్లం. ఈసారి మెక్సికన్లను రెండో స్థానానికి నెట్టేసి ఇండియా మరింత నిర్లక్ష్యంగా మారిపోయింది.
40 దేశాల్లో చేసిన ఈ సర్వేలో పాల్గొన్నవారికి ఆయా దేశాల గురించి పలు ప్రశ్నలు అడిగారు. వాటికి వారు ఎంతవరకు సమాధానం ఇచ్చారన్న దాన్ని బట్టి దేశం గురించి వారికెంత తెలుసన్న అంచనా వేసుకున్నారు.
ఇండియాలోకి వచ్చేసరికి మన జనాభా... జీడీపీ ఎంత అనే ప్రశ్నలకు కూడా చాలామంది ఆమడ దూరంలో సమాధానాలిచ్చారట. దేశంలో ముస్లింలు ఎంత శాతం ఉన్నారన్నది కూడా ఇక్కడి ప్రజలకు తెలియదని తేలిపోయింది. దీంతో పట్టింపులేని మనుషులున్న దేశంగా మనకు స్టాంపు వేసేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/