భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే మొత్తం క్రికెట్ ప్రపంచమంతా ఎంత ఆసక్తిగా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్ కు కూడా ఇంత ఆదరణ ఉండదు. క్రికెట్లో దీనికి మించిన మ్యాచ్ మరొకటి ఉండదు. ఆ రెండు జట్లూ తలపడితే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులకు పండగే. ఐసీసీకి కాసుల పంటే. రెండు జట్ల మధ్య ఒక్క మ్యాచ్ తో వందల కోట్లు సమకూరుతాయంటే దీనికి ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఐతే గత దశాబ్ద కాలంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో క్రికెట్ సంబంధాలు కూడా తెగిపోయాయి. ద్వైపాక్షిక సిరీస్ లు జరగట్లేదు.
అప్పుడప్పుడూ ఐసీసీ టోర్నీల్లో తలపడటమే మిగిలింది. ఐతే దౌత్య సంబంధాల సంగతి పక్కన పెట్టి క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించాలన్న డిమాండ్ కొందరు వినిపిస్తూ వస్తున్నారు. ఐతే ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ జరగబోతున్న నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ఈ విషయమై ప్రకటన చేశాడు. ఐసీసీ టోర్నీల్లో ఆడితే ఆడొచ్చు కానీ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లకు మాత్రం అవకాశమే లేదని ఆయన తేల్చి చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ కు నష్టం చేకూరుస్తున్న నేపథ్యంలో వారితో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇలా అధికార పార్టీ అగ్ర నేత భారత్-పాక్ క్రికెట్ సంబంధాలపై మాట్లాడటం అరుదైన విషయమే. అందులోనూ రెండు జట్లూ ఓ హై వోల్టేజ్ మ్యాచ్ కు రెడీ అవుతున్న నేపత్యంలో షా ఇలాంటి ప్రకటన చేయడం ఆశ్చర్యమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/