చైనాపై మరో యుద్ధానికి భారత్ రెడీ!

Update: 2020-07-01 04:19 GMT
విస్తరణ కాంక్షతో సరిహద్దుల్లో కయ్యానికి కాలుదూస్తూ భారత సైనికులను చంపిన చైనా దురాక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధించి డిజిటల్ వార్ కు తెరతీశాడు. తాజాగా మరో భారీ యుద్ధానికి సిద్ధమయ్యాడు.

చైనా కమ్యూనిస్టు పార్టీకి అత్యంత సన్నిహిత సంబంధాలున్నా  టెక్ దిగ్గజం‘హువాయ్’ కంపెనీకి షాకిచ్చేందుకు భారత్ రెడీ అయ్యింది.

హువాయ్ టెక్నాలజీ రంగంలో 5జీని ఇంట్రడ్యూస్ చేసిన గ్లోబల్ మార్కెట్ లీడర్. ఇది చైనా కమ్యూనిస్టు పార్టీకి అత్యంత సన్నిహితమైనది. ఆ విషయం తేలడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ‘హువాయ్’ 5జీని అమెరికాలో నిషేధించి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. భారత్, బ్రిటన్ కూడా చైనా ‘హువాయ్’5జీని నిషేధించాలని కోరారు.

గత 20 ఏళ్లుగా  భారత్ టెలికాం రంగంలో తన ఉనికిని చాటుతున్న హువాయ్ పై త్వరలోనే భారత ప్రధాని నరేంద్రమోడీ నిషేధం విధించేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు అగ్రశ్రేణి మంత్రుల బృందంతో తాజాగా చర్చించారని తెలిసింది. త్వరలోనే చైనీస్ హువాయ్ 5జీ పరికరాలను దేశంలో బ్యాన్ చేయనున్నారని తెలిసింది.

ఇప్పటికే దేశంలో 5జీ వేలం జరగాల్సి ఉండేది. అందులో హువాయ్ నుంచే భారత టెలికాం కంపెనీలు 5జీ పరికరాలను కొనేందుకు రెడీ అయ్యాయి. అయితే కరోనా లాక్ డౌన్ తోపాటు ఐడియా, వోడాఫోన్ ఆర్థికంగా కుదేలు కావడంతో వాయిదా వేశారు. ఇప్పుడు చైనా దురాక్రమణ నేపథ్యంలో చైనా కమ్యునిస్టులకు దగ్గరి సంబంధాలున్న హువాయ్ ను నిషేధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

ఇప్పటికే హువాయ్ 4జీ చైనా పరికరాలు వాడొద్దంటూ కేంద్రం టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే చైనాకు గట్టి షాక్ ఇచ్చేలా మోడీ ఈ సంచలన ప్రకటన చేయబోతున్నారని సమాచారం.
Tags:    

Similar News