స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి పలువురు ప్రధానమంత్రులు బాధ్యతలు నిర్వర్తించారు. కానీ.. ఒక ఛాయ్ వాలా దేశ ప్రధాని కావటం ఒక ఎత్తు అయితే.. తన పదవీ కాలంలో మోడీ నెలకొల్పినన్ని రికార్డులు సమీప భవిష్యత్తులో మరో ప్రధానమంత్రి బ్రేక్ చేసే అవకాశమే లేదన్న మాట వినిపిస్తోంది. తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో.. దేశంలో తక్కువ.. విదేశాల్లో ఎక్కువ అన్నట్లుగా మోడీ కాలం గడపటంపై పలు విమర్శలు చోటు చేసుకున్నాయి. దీనిపై వ్యంగ్యస్త్రాల్ని సంధించాయి విపక్షాలు. అయితే.. మోడీ విదేశీ పర్యటనల కారణంగా అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్ ఎంత భారీగా పెరిగిందన్న విషయం ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ప్రజలకు అర్థమవుతున్న పరిస్థితి.
వైట్ హౌస్ నుంచి వచ్చే ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటించటమే తప్పించి.. అమెరికా అధ్యక్షుడి మనోభీష్టానికి భిన్నంగా వ్యవహరించటం ఒక ఎత్తు.. కశ్మీర్ ఇష్యూలో వేలెట్టాలన్న కుతూహలాన్ని ప్రదర్శిస్తున్న ట్రంప్ కు.. ఆ విషయంలో మీరెందుకు? మీకంత కష్టం అక్కర్లేదు.. మేం చూసుకుంటాం కదా అని ఆయన ఎదుటే చెప్పటమే కాదు.. అందుకు మొండి ట్రంప్ సైతం మౌనంగా ఓకే అనటం అంత చిన్నవిషయం కాదు. ఒక ప్రెస్ మీట్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతాన్ని చూస్తే చాలు.. విదేశీ వ్యవహారాల విషయంలో మోడీ సర్కారు ఎంత చురుగ్గా ఉందన్న విషయం అర్థం కావటమే కాదు.. భారత్ మాటను అమెరికా అధ్యక్షుడు వినే వరకూ వెళ్లటం శుభ సంకేతంగా చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే.. తాజాగా రష్యాలో పర్యటిస్తున్నప్రధాని మోడీ.. తన రికార్డుల పరంపరలో మరో రికార్డును క్రియేట్ చేశారు. తన విదేశీ పర్యటనల్లో భాగంగా పలు దేశాల్లో పర్యటించే మోడీ.. పలు రికార్డుల్ని క్రియేట్ చేస్తుంటారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పటమో.. లేదంటే ఆయన మీడియా వ్యవహారాలు చూసే టీం ఈ విషయాలకు విపరీతమైన ప్రాధాన్యత లభించేలా ప్రయత్నిస్తుంటుంది. తాజా రష్యా పర్యటనలో దేశ ప్రధానుల్లో మరెవరూ వెళ్లని రష్యా తూర్పుకొసన ఉన్న వ్లదివొస్తొక్ ను మోడీ సందర్శించారు.
దీంతో ఆ ప్రాంతాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ ఖ్యాతి గడించారు. మోడీ - పుతిన్ మధ్య సదస్సు ప్రారంభం కావటానికి ముందు ఇరువురు అగ్రనేతలు కలిసి సరదాగా రెండు గంటల పాటు నౌకా విహారాన్ని చేయటం గమనార్హం. ఈ సందర్భంగా వారిద్దరూ సరదాగా గడపటమే కాదు.. ఇరు నేతల మధ్య అప్యాయత కొట్టొచ్చినట్లుగా కనిపించింది. వ్లదివొస్తొక్ లోని అత్యాధునిక జ్వెజ్డా షిప్ యార్డ్ ను మోదీకి పుతిన్ దగ్గరుండి చూపించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది మాస్కోలో జరిగే 75వ ‘విజయోత్సవ’ వేడుకలకు మోదీని పుతిన్ ఆహ్వానించారు.
ఈ పర్యటనలో భాగంగా రష్యాతో పలు కీలక ఒప్పందాల్ని చేసుకున్నారు ప్రధాని మోడీ. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రష్యా సైన్యానికి అవసరమైన పరికరాలు ఇకపై భారత్ లో తయారు కానున్నాయి. దీనికి సంబంధించిన ఒప్పందం ఇరు దేశాల మధ్య జరగటం గమనార్హం. సైనిక ఉత్పత్తులు.. విడిభాగాల్ని ఇరు దేశాలు కలిసి తయారు చేసేందుకు వీలుగా రక్షణ సహకారంలో 2020 వరకూ రూపొందించిన ప్లాన్ ను మరో పదేళ్లకు పొడిగిస్తూ ఇరువురు నేతలు నిర్ణయం తీసుకున్నారు.
తన పర్యటనలో భాగంగా రష్యాతో చేసుకున్న కీలకమైన ఒప్పందాల విషయానికి వస్తే.. అంతరిక్ష్యం.. వాణిజ్యం.. చమురు.. సహజవాయువు.. అణు ఇంధనంతో పాటు సముద్ర మార్గంలో రవాణా లాంటి కీలక రంగాల్లో మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించారు. 15 ఒప్పందాలపైన ఇరు దేశాల అధికార ప్రతినిధులు సంతకాలు చేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా రష్యాలోని వ్లదివోస్తాక్ నుంచి చెన్నైకి నేరుగా సముద్ర మార్గంలో రవాణాను ప్రారంభించాలన్న అంశం మీదా చర్చలు జరిపారు.
తమిళనాడులోని కుడంకుళంలో నిర్మించే మరో నాలుగు అణు రియాక్టర్లపైనా సమీక్షలు జరిపారు. గగన్ యాన్ ప్రాజెక్టు కోసం భారత వ్యోమగాములకు ట్రైనింగ్ ఇచ్చేందుకు రష్యా ఓకే చెప్పింది. కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని.. జోక్యం ఉండదని తేల్చి చెప్పింది రష్యా. జమ్ముకశ్మీర్ విషయంలో తమ సర్కారు తీసుకున్న నిర్ణయాల్ని పుతిన్ కు మోడీ వివరించారు. మొత్తానికి తన తాజా పర్యటనను మోడీ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తున్నట్లుగా చెప్పక తప్పదు.