ఐరాసకు భారత్ సూటి ప్రశ్నలు!

Update: 2016-11-08 09:36 GMT
ఐక్యరాజ్యసమితిపై భారత్ సీరియస్ అయ్యింది. ఉగ్రవాద సంస్థల అధినేతలపై ఆంక్షలు విధించడంలో భద్రతామండలి ఘోరంగా విఫలం అవుతోందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇదే సమయంలో అజహర్‌ ను నిషేధించాలంటూ గతంలో భారతదేశం చేసిన ప్రతిపాదనను భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా రెండుసార్లు అడ్డుకుంది. దీనికి కారణం పాక్ తో చైనాకున్న స్నేహమనేది జగమెరిగిన సత్యమే. మిత్రదేశానికి ఎలాగైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యమో లేక భారత్ కు అడ్డురావాలనే బుద్దో కానీ... చైనా ఈ విషయంలో భారత్ కు అడ్డుపడుతూనే ఉంది. దీంతో భారత్ ఈ సారి ఐరాసపై సీరియస్ అయ్యింది.

జైషే మహ్మద్ సంస్థను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి బ్లాక్‌ లిస్టులో పెట్టినా కూడా దాని అధినేత మసూద్ అజహర్ (48)ని మాత్రం నిషేధించడంలో ఐరాస ఎంఉదు మీనమేషాలు లెక్కిస్తుందో తమకు అర్ధం కావడం లేదని భారత్ అంటుంది. దీనికి సంబందించి... తమ దేశంలో ఈ ఏడాదే జైషే మహ్మద్ సంస్థ రెండుసార్లు  దారుణమైన ఉగ్రదాడులకు పాల్పడిందని భారత్ ఆరోపించింది. వీటిలో ఒకటి జనవరిలో పఠాన్‌ కోట్ వైమానిక స్థావరంపై కాగా, రెండో దాడి సెప్టెంబర్‌ లో ఉడీలోని సైనిక స్థావరంపైన చేసింది. ఈ రెండు ఘటనల్లో కలిపి 26 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఆ రెండు కారణాలను తాజాగా ఐరాసకు తెలిపిన భారత్... తమదేశంలోని ఏదో ఒక ప్రాంతంలో దాదాపు ప్రతిరోజూ ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారని తెలిపింది. వాటన్నింటికీ దాదాపు ఒకటే సంస్థ కారణమని, అలాంటి సంస్థలకు తామే అధినేతలమని ప్రకటించుకున్నవాళ్లపై కూడా నిషేధం విధించడానికి భద్రతామండలి ఎందుకు ఆలోచిస్తుందని, ఈ క్రమంలో ఇప్పటికే 9 నెలల సమయం తీసుకుందని అక్బరుద్దీన్ గుర్తుచేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News