క్యాలెండర్లో రోజులు గడిచిపోతున్నాయి. మోడీ సర్కారు లాక్ డౌన్ విధించటానికి ముందే తెలంగాణలో అలాంటి పరిమితులు రావటం తెలిసిందే. ఇరవైఒక్కరోజుల లాక్ డౌన్ వ్రతంతో కరోనాను కంట్రోల్ చేయొచ్చన్నట్లుగా చెప్పిన పాలకులు.. ఇప్పుడు మరింత పొడిగింపు అవసరం అంటున్నారు. ఎంత కట్టడి చేసినా.. కరోనా కేసులు ఆగటం లేదు. ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉందంటే.. అది పశ్చిమదేశాలతో పోలిస్తే.. కేసుల నమోదు తక్కువగా ఉండటం. ఇంతకీ మనం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం? అన్నది క్వశ్చన్. దేశంలో ఇప్పుడు ఆరు వేల కేసుల దగ్గరకు వచ్చేశాం. బుధవారం ఒక్క రోజులో ఐదు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి.
ఊరట ఇచ్చే అంశం ఏదైనా ఉందంటే.. మరణాల సంఖ్య తక్కువగా నమోదు కావటం. అమెరికాలాంటి దేశంలోనే కేసులు లక్షల్లో నమోదవుతూ.. వేలల్లో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. వాటితో పోలిస్తే.. మన పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పక తప్పదు. ఇంతకీ మనం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం? అన్న క్వశ్చన్ తలెత్తక మానదు. ఎందుకిలా అంటే.. కొందరు రెండో స్టేజ్ లో ఉందంటే.. మరికొందరు రెండున్నర స్టేజ్ లో ఉన్నామని.. మరికొందరు ఉత్సాహవంతులు మాత్రం మూడో స్టేజ్ కు వచ్చేసినట్లుగా చెబుతున్నారు.
వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేసుకొని చూసినప్పుడు మనం ఇంకా రెండో స్టేజ్ లోనే ఉన్నామని చెప్పాలి. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల మూలాలు.. వారికి వైరస్ సోకటానికి కారణాలు తేలిపోతుండటమే కారణం. తొలుత విదేశాల నుంచి వచ్చిన వారు.. తర్వాత మర్కజ్ నుంచి వచ్చిన వారి కారణంగా వైరస్ వ్యాప్తి సాగుతోంది. ప్రస్తుతం వెలుగు చూస్తున్న కేసులన్ని మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారితో దగ్గరగా ఉన్న వారు.. సన్నిహితంగా మెలిగిన వారే ఎక్కువగా ఉంటున్నారు.
ఈ గొలుసును ఇప్పుడే తెంపగలిగితే.. మూడో స్టేజ్ కు వెళ్లకుండానే వైరస్ ను నిరోధించే వీలుంది. దీనికి లాక్ డౌన్ కు మించిన మందు లేదు. ఎంతో అవసరమైతే తప్పించి బయటకు రాకుండా ఉండటమే తప్పించి.. మరో మార్గం లేదు. రెండో దశలో ఉన్నప్పుడు మాత్రమే పరిస్థితి మన కంట్రోల్ లో ఉంటుందన్నది మర్చిపోకూడదు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం భారీగా చెల్లించాల్సి ఉంటుంది.