శత్రువులను లొంగ దీసుకోవాలంటే.. సామదానబేధదండోపాయాలన్నీ ఉపయోగించాలనేది పెద్దల మాట! ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ విషయంలోనూ భారత్ ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతోంది! దేశంలో అరాచకం సృష్టించి.. దాయాది దేశంలో తలదాచుకున్న అతడిని పట్టుకునేందుకు భారత్ విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది. దావూద్ కు ఆశ్రయం కల్పిస్తోందని భారత్ స్వరం పెంచిన ప్రతిసారీ.. పాకిస్థాన్ తన కుటిల స్వభావాన్ని బయట పెడుతూనే ఉంది. అయితే దావూద్ పాక్ లోనే ఆశ్రయం పొందుతున్నాడని.. అతడి సోదరుడు పోలీసుల విచారణలో వెల్లడించిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో దావూద్ తో పాటు అతడిని ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వస్తున్న పాక్ కు సరైన బుద్ధి చెప్పేందుకు భారత్ అదిరిపోయే ప్లాన్ అమలుచేయబోతోంది!
ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఒకే ప్లాన్‌తో అటు దావూద్.. ఇటు పాకిస్థాన్ లక్ష్యంగా భారత్ వ్యూహాలు రచిస్తోంది. ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోనే తలదాచుకున్నట్లు మరోసారి రుజువైంది. ఇంటెలిజెన్స్ బ్యూరో తాజా విచారణలో ఈ విషయం వెల్లడయ్యింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు దిగినట్లు ఓ ఐబీ అధికారి తెలిపారు. అతడి ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందన్న ఉద్దేశంతో పాకిస్థాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ ఐ.. మూడు నెలల్లో నాలుగైదు ప్రాంతాలకు మార్చిందంట. ప్రస్తుతం కరాచీ నుంచే కార్యకలాపాలు మొదలుపెట్టిన దావూద్ దుబాయ్ లో ఉన్న ఓ వ్యక్తితో సంభాషిస్తుండగా ఆడియోలను రికార్డు చేసిందని చెబుతున్నారు.
ఈ మేరకు యూఏఈ ప్రభుత్వంతో ఐబీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్-భారత్ మధ్య డ్రగ్స్ వ్యవహారంతోపాటు, ముంబైలో లావాదేవీలు చూసుకుంటున్నాడంట. దీంతో ఎలాగైనా దావూద్‌ను బయటకు రప్పించే ఉద్దేశంతో ఉన్న భారత్ ప్లాన్ `బీ` ని అమలు చేయబోతోందట. దీని ప్రకారం దావూద్ వ్యాపారాలను నాశనం చేయబోతోందట. తద్వారా ఆర్థికంగా దావూద్ ను దెబ్బతీయటం.. ఆ దెబ్బకు పాక్ కూడా అతనికి సహకరించటం ఆపేస్తుందని భారత్ భావిస్తోంది. మరి ఇది ఎంత వరకూ సత్ఫలితాలిస్తుందో వేచిచూడాల్సిందే!!