రక్షణ రంగంలో మరింత దూకుడును ప్రదర్శిస్తోంది మోడీ సర్కారు. రక్షణ అవసరాలకు పెద్ద పీట వేయటంతోపాటు.. అత్యున్నత సాంకేతికత కలిగిన యుద్ధ విమానాల్ని కొనుగోలు విషయంలో మోడీ సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రక్షణ రంగాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు వీలుగా మరో ఐదు రోజుల్లో మోడీ సర్కారు చేసుకోనున్న ఒప్పందం మన పొరుగున ఉన్న చైనాకు షాకిచ్చేలా ఉందన్న మాట వినిపిస్తోంది.
ఈ నెల 11న మోడీ తన జపాన్ పర్యటనలో భాగంగా కీలకమైన 18 ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేయనున్నారు. వాస్తవానికి దీనికి సంబంధించిన ప్రక్రియ రెండేళ్ల క్రితం మొదలైనా.. ఇప్పుడు మరింత వేగవంతమైంది. దాదాపు రూ.11 వేల కోట్ల రూపాయిలున్న ఈ ఒప్పందం కారణంగా భారత రక్షణ రంగం మరింత బలోపేతం కానుందని చెప్పక తప్పదు.
చైనాకు సైతం షాకిచ్చే ఈ ఒప్పందంలో ఏముందన్న విషయాన్ని చూస్తే.. డ్రాగన్ దిగులు కలిగే అంశాలు తాజా డీల్ లో ఉన్నాయని చెప్పక తప్పదు. జపాన్ తో ఒప్పందం చేసుకోనున్న షిన్ మేవా తయారీ యూఎస్ 2ఐ ఎయిర్ క్రాఫ్ట్ ల సామర్థ్యమే చైనా ఉలికిపాటుకు కారణంగా చెప్పాలి. గగనతలంతో పాటు.. నీటిపైనా ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రత్యేకతలు చూస్తే.. 4700 కిలోమీటర్ల పరిధిల వరకూ దూసుకెళ్లటంతో పాటు.. 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసి పడుతున్నా సముద్రంపై జాగ్రత్తగా ల్యాండ్ అయ్యే సామర్థ్యం ఈ ఎయిర్ క్రాఫ్ట్ సొంతం.
అంతేకాదు.. అత్యంత వేగంగా సైనికుల్ని హాట్ జోన్ లకు చేరవేసే సత్తాతో పాటు.. అత్యవసర సమయాల్లో ఎయిర్ క్రాఫ్ట్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నేవీ నిపుణులు చెబుతున్నారు. గగనతలంతో పాటు.. నీటిపైనా లక్ష్యాల్ని కచ్ఛితంగా చేధించే సత్తా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ల సొంతంగా చెబుతున్నారు. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా చేసుకోనున్న తాజా ఒప్పందంలో హిందుస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ తో ఒప్పందం జరగనుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు ఇండియాకు దిగుమతి చేసుకొని.. వాటి అసెంబ్లింగ్ మాత్రం భారత్ లోనే చేపట్టనున్నారు. 2016 నుంచి ప్రతి ఏటా రెండు నుంచి మూడు వరకూ ఎయిర్ క్రాఫ్ట్ లను సరఫరా చేయనున్నారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ డీల్ చైనాకు కాసింత షాకింగ్ అనే అభిప్రాయాన్ని రక్షణ రంగ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/