72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మోదీ ఆసక్తికరంగా ప్రసంగించారు. పేదలకు భరోసానిచ్చే `ఆయుష్మాన్ భవ`ను మోదీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గత నాలుగేళ్లుగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ...మరోమారు అవకాశమివ్వాలన్నట్లు ప్రసంగించారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని....రెడ్ టేప్ నుంచి రెడ్ కార్పెట్ కు - రిఫామ్..పెర్ ఫామ్..ట్రాన్స్ ఫామ్ కు మారిందని..తమ హయాంలోని ఇవన్నీ సాధ్యమయ్యాయని అన్నారు. దాంతోపాటు, 2022లో అంతరిక్షానికి భారతీయుడిని పంపుతామని ప్రకటించారు.
అంతరిక్ష పరిజ్ఞానంలో భారత్ ఎన్నో కలలను సాకారం చేసుకుంటోందని, అగ్రదేశాలకు దీటుగా మన శాస్త్రవేత్తలు రాణిస్తున్నారని మోదీ అన్నారు. మన శాస్త్రవేత్తల కలలను సాకారం చేసేందుకు 2022 లేదా అంతకన్నా ముందే ....మానవసహిత స్పేస్ మిషన్ ను చేపడతామని ప్రకటించారు.
మన శాస్త్రవేత్తలను చూసి తనతోపాటు దేశం మొత్తం గర్వపడుతోందని....పరిశోధనల్లో - వినూత్న ఆవిష్కరణల్లో వారి కృషి ఎనలేనిదని మోదీ కితాబిచ్చారు. 100కు పైగా ఉపగ్రహాలను మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించారని - మార్స్ మిషన్ ను కూడా విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు. భవిష్యత్తులో భారత శాస్త్రవేత్తలు మరిన్ని విజయాలను సాధించాలని, ప్రపంచంలోని అగ్రదేశాలకు దీటుగా రాణించాలని ఆకాంక్షించారు.