ఇండియా టుడే స‌ర్వే.. తెలుగు ముఖ్య‌మంత్రుల ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గిపోయిందే!

Update: 2021-08-17 13:55 GMT
వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన‌గానే.. ఆయ‌న‌కున్న ప్ర‌జాద‌ర‌ణ‌, ఆయ‌న ఫాలోయిం గ్‌.. వంటివి వెంట‌నే స్ఫుర‌ణ‌కు వ‌స్తాయి. పాద‌యాత్ర స‌మ‌యంలో ఆయ‌న నిర్వ‌హించిన స‌భ‌ల‌కు ఇసకే స్తే రాల‌నంత‌గా ప్ర‌జ‌లు వ‌చ్చారు. అదేస‌మ‌యంలో రాజ‌మండ్రి ఓవ‌ర్ బ్రిడ్జిపై పాద‌యాత్ర చేసినప్పుడు .. అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. జ‌గ‌న్‌ను అనుస‌రించిన‌ ప్ర‌జావాహినికి స‌ద‌రు బ్రిడ్జి ఎక్క‌డ కూలిపో తుందోన‌ని ఉత్కంఠ‌కు గురైంది. దీనిని బ‌ట్టి జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ ఏంటో ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. ఇదే.. ఆయ‌న‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చింది.

అయితే.. ఇప్పుడు లెక్క‌లు మారాయి. మునుప‌టి ప్ర‌జాద‌ర‌ణ ఇప్పుడు జ‌గ‌న్‌కులేద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక్క ఛాన్స్ పిలుపుతో.. ప్ర‌జ‌లు.. జ‌గ‌న్ వైపు నిల‌బ‌డ్డారు. దీంతో ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాయి. అయితే.. అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో జ‌గ‌న్ పాల‌న‌కు సంబం ధించి ప్ర‌ముఖ ప‌త్రిక‌.. ఇండియా టుడే.. `ది మూడ్ ఆఫ్ దినేష‌న్‌` పేరిట ఓ స‌ర్వేను నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో .. జ‌గ‌న్‌కు ప్ర‌జాద‌ర‌ణ భారీగా త‌గ్గిపోయిన విష‌యం వెల్ల‌డైంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల ప‌నితీరుపై సాగిన ఈ స‌ర్వేలో ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌ల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ఈ క్ర‌మంలో టాప్ 10లో ఉన్న ముఖ్య‌మంత్రుల జాబితాను ప్ర‌క‌టించారు. వీరిలో ఏపీ సీఎం జ‌గ‌న్ పేరు లేక పోవ‌డంగ‌మ‌నార్హం. వాస్త‌వానికి గ‌త ఏడాది ఆగ‌స్టులో నిర్వ‌హించిన స‌ర్వేలో.. జ‌గ‌న్ నాలుగో ఉత్త‌మ సీఎంగా గుర్తింపు పొందారు. అయితే.. ఈ ద‌ఫా మాత్రం ఆయ‌న ప‌ది స్థానాల్లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అయితే.. ఆయ‌న‌కు ఏ ర్యాంకు వ‌చ్చింద‌నే విష‌యం చెప్ప‌క‌పోయినా.. గ‌త ఏడాదికంటే.. ఇప్పుడు 11 శాతం ప్ర‌జాద‌ర‌ణ మాత్రం త‌గ్గిపోయిన‌ట్టు స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

అయితే.. ఇత‌ర రాష్ట్రాల కంటే.. కూడా.. ఏపీలోనే అధికంగా.. ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయ‌నేది ప్ర‌జ‌ల మాట‌గా స‌ర్వే స్ప‌ష్టం చేసింది. గ‌త ఏడాది సీఎం జ‌గ‌న్‌కు నాలుగో స్థానం ల‌భించ‌డంతో వైసీపీ నాయ‌కులు, ఆయ‌న అనుకూల మీడియా భారీ ఎత్తున ఈ స‌ర్వేను ప్ర‌చారం చేశారు. కానీ, ఇప్పుడు ఇదే స‌ర్వే విష‌యంలో వారు సైలెంట్ అయిపోయారు.

అయితే.. జ‌గ‌న్‌కు ప్ర‌జాద‌ర‌ణ ఎందుకు త‌గ్గింద‌నే విష‌యంపై మాత్రం స‌ర్వే వివ‌రాలు వెల్ల‌డించ‌క‌పోయినా.. ఆర్థిక కార‌ణాలే ప్ర‌ధానంగా క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాక‌పోవ‌డం, అభివృద్ది లేక పోవ‌డం, మౌలిక స‌దుపాయాల కొర‌త‌, ఇలా ప‌లు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు వ‌చ్చిన ఫ‌లితాన్ని అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని.. మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న పాల‌న విష‌యంలో మ‌ధ్య‌లో(కేవ‌లం రెండున్న‌రేళ్లు పూర్తి చేసుకున్నారు) ఉన్నార‌ని.. మ‌రింత భ‌విష్య‌త్తు ఉంద‌ని అంటున్నారు.

ఇక‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న కూడా తొలి 10 మంది ఉత్త‌మ సీఎం ల జాబితాలో చోటు ద‌క్కించుకోలేక పోయారు. దీంతో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కూడా త‌మ పాల‌న‌ను చ‌క్క‌దిద్దుకోవాల‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News