రెండు శత్రుదేశాలు.. పగ ప్రతీకారాలతో మూడు యుద్ధాలు చేసుకున్న దాయాది దేశాలు.. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సమరం అంటే యావత్ ప్రపంచం ఆసక్తి చూపుతుంది. భారత్-పాకిస్తాన్ దేశాల్లో అయితే నరాలు తెగే ఉత్కంఠ. అలాంటి మరో ప్రపంచ క్రికెట్ సమరం మళ్లీ వచ్చింది.
చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య మరికొన్ని గంటల్లోనే ప్రపంచకప్ అండర్ 19 సెమీస్ సమరం మొదలు కాబోతోంది. ప్రపంచకప్ లో భాగంగా దక్షిణాఫ్రికా లో జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ లో భారత్, పాకిస్తాన్ రెండూ సెమీస్ చేరాయి. దీంతో ఈ మధ్యా 1.30 భారత్-పాక్ సెమీస్ పోరు ఉత్కంఠ రాజేస్తోంది. గత రెండు పర్యాయాలు ప్రపంచకప్ ఫైనల్ కు చేరిన భారత యువ జట్టు ఈసారి కూడా సమరోత్సాహంతో పాకిస్తాన్ ను చిత్తు చేయడానికి రెడీ అవుతోంది.
అండర్ 19 ప్రపంచకప్ లో గతంలో నాలుగు సార్లు భారత్ ప్రపంచకప్ గెలిచింది. పాకిస్తాన్ రెండు సార్లు గెలిచింది. అయితే అండర్ 19 కప్ లో భారత్ పై ఒక్కసారి కూడా పాకిస్తాన్ గెలిచిన చరిత్ర లేదు.
గ్రూపు దశలో మూడు మ్యాచ్ లు నెగ్గిన భారత్, క్వార్టర్స్ లో బలమైన ఆస్ట్రేలియాపై గెలిచి సెమీస్ కు చేరింది. పాకిస్తాన్ లీగ్ దశలో రెండే మ్యాచ్ లు గెలిచింది. తాజా పరిస్థితి చూస్తూ రెండు జట్లు బలంగానే ఉన్నాయి. గెలుపును అంచనా వేయడం కష్టంగా మారింది.
భారత్ బ్యాంటింగ్ బలంగా ఉంది. ఓపెనర్ యశస్వి ఫామ్ లో ఉన్నారు. మూడు హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలింగ్ అద్భుతంగా ఉంది. ఇక పాకిస్తాన్ బౌలింగ్ బలంగా ఉంది. మహ్మాద్ హారీస్ ఒక్కడే పరుగులు చేస్తున్నారు. భారత బ్యాంటింగ్ ను కూల్చే సత్తా పాక్ కు ఉంది.