మెహాలీ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. భారత్.. దక్షిణాఫ్రికా మధ్య మొదలైన తొలి టెస్ట్ లో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయటం తెలిసిందే. కేవలం 201 పరుగులకు అలౌట్ కావటం భారత్ క్రికెట్ అభిమానుల్ని అసంతృప్తికి గురి చేసింది. ఇంత స్వల్ప స్కోర్ కి అలౌట్ అయిన నేపథ్యంలో సఫారీలు ఇరగదీసేస్తారని.. భారత్ కు కష్టాలు తప్పవన్న భావనలో చాలామంది ఉన్నారు.
అయితే.. విపరీతంగా స్పిన్ తిరిగే లక్షణం ఉన్న మొహాలీ పిచ్ చేసే మేజిక్ చేసింది. భారత్ 201 పరుగులకు అలౌట్ అయితే.. సఫారీలు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 28 పరుగులకు 2 విలువైన వికెట్లు కోల్పోవటం తెలిసిందే. శుక్రవారం ఆట కొనసాగించిన వారు కేవలం..184 పరుగులకే కుప్పకూలిపోవటం విశేషం. డివిలియర్స్.. అమ్లా తప్పించి మరెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. డివిలియర్స్ 63 పరుగులు చేస్తే.. అమ్లా 43 పరుగులు చేశారు. మరో బ్యాట్స్ మన్ ఎల్గర్ 37 పరుగులు చేశారు.
ఈ ముగ్గురు చేసిన పరుగులే 143. వీరి స్కోర్ ను మినహాయిస్తే మిగిలిన ఏడుగురు సఫారీ బ్యాట్స్ మెన్లు చేసింది 39 పరుగులు కావటం గమనార్హం. ఇరు జట్ల తొలి ఇన్నింగ్స్ లు ముగిసే సమయానికి భారత్ 17 పరుగుల అధిక్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా బ్యాట్స్ మెన్లు కానీ బ్యాట్ ను ఝుళిపిస్తే.. టీమిండియా అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు.