టీమిండియాలో ప్రయోగాలు విఫలమవుతున్నాయి. మంచి ఆటగాళ్లను పక్కనపెట్టి నాసిరకం టీంతో ఆడుతూ పరాజయాల అంచున నిలబడుతోంది. ఇప్పటికే ఆసియా కప్, టీ20 కప్ ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు పసికూన బంగ్లాదేశ్ చేతిలోనూ ఓటమి అంచున ఉంది.
పసికూన బంగ్లాదేశ్ చేతిలోనూ టీమిండియా ఓటమి అంచున నిలబడింది. కేవలం 145 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఆపసోపాలు పడుతోంది. నిన్న వరుసగా 45 పరుగులకే 4 వికెట్లు పడడంతో అక్షర్ పటేల్, ఉనద్కత్ లాంటి బౌలర్లను వికెట్లు పడకుండా కాపుకాసిన టీమిండియా ఈరోజు ఉదయం బంగ్లాదేశ్ తో 4వ టెస్టులో మొదటి అరగంటలోనే వీరి వికెట్లు కోల్పోయింది. ఇక ఇండియాను నిలబెడుతారని ఆశించిన రిషబ్ పంత్ సైతం 9 పరుగులకే అవుట్ అయ్యి టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టాడు.
3వ రోజు పూర్తయ్యేసరికి టీమిండియాకు చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఇంకో 100 పరుగులు చేస్తే విజయం కానీ ఆ 100 కూడా కొట్టలేక ఇప్పుడు ఓటమి అంచను నిలబడింది. ఈరోజు ఆట మొదలుకాగానే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 76 పరుగులకే 7 వికెట్లుకోల్పోయి పీకల్లోతు అంచుల్లో నిలబడింది.
డిఫెన్స్ ఆడడంలో తోపులైన పూజారా, , శుభ్ మన్, కోహ్లీ లాంటి వారు కూడా ఒక్క పరుగు చేయడానికి కష్టపడ్డారు. కోహ్లీ అయితే 22 బంతులాడి ఒక్కపరుగు చేశాడు. దీన్ని బట్టి నాలుగో రోజు ఛేదన అంత ఈజీ కాదని అర్థమవుతోంది.
ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్, అశ్విన్ 7 వికెట్ పై పోరాడుతున్నారు. బంగ్లా స్పిన్నర్ల గింగిరాలు తిరిగే బంతులను ఎదుర్కొంటూ నిలబడుతున్నారు. వీరిద్దరూ ఆడితేనే టీమిండియా నిలుస్తుంది. తర్వాత వచ్చేవారంతా బౌలర్లు. కాబట్టి ఈ సవాలును టీమిండియా స్వీకరిస్తుందా? లేదా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తుందా? అన్నది చూడాలి.
ఈ టెస్ట్ ఓడిపోతే టీమిండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లే అర్హత కోల్పోతుంది. బంగ్లాపై రెండు టెస్టులు గెలిస్తేనే ఇండియాకు ఛాన్స్ ఉంటుంది.