భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ టై.. సిరీస్ టీమిండియా కైవసం

Update: 2022-11-22 11:31 GMT
న్యూజిలాండ్ తో మూడు టీట్వంటీల సిరీస్ ను భారత్ 1-0తో గెలుచుకుంది. టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లో ఓడి ఇంటిదారి పట్టిన భారత్ జట్టు ఇప్పుడు న్యూజిలాండ్ పై సిరీస్ నెగ్గడం ఉపశమనంగా చెప్పొచ్చు. అయితే ఇదంతా సెకండ్ కేటగిరీ టీం అని చెప్పొచ్చు. టీ20 కప్ లో ఆడిన రోహిత్, విరాట్ , కేఎల్ రాహుల్, అశ్విన్, షమీ లాంటి వారు ఎవరూ లేకుండా హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో యువకులతో కూడిన ఈ జట్టు కివీస్ పై అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. బలమైన న్యూజిలాండ్ ను వారి గడ్డపైనే ఓడించడం సంచలనంగా చెప్పొచ్చు.

టీ20 ప్రపంచకప్ తర్వాత ఆడిన తొలి టీ20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకొని సత్తా చాటింది. సీనియర్ల గైర్హాజరీలో యువ టీం ఈ అద్భుతాన్ని చేసి చూపించింది. భారత ఆటగాళ్లకు వరుణుడు తోడు కావడంతో రెండు మ్యాచ్ లు వర్షం కారణంగానే నిలిచిన పరిస్థితి. 2వ టీ20  మాత్రం జరిగి భారత్ గెలిచింది. ఇక మూడో టీ20 కూడా 161 పరుగుల లక్ష్య ఛేదనలో ఉండగా 75/4 స్కోరుతో టీమిండియా ఉండగా వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది. అయితే డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ టైగా ముగిసింది.

నిజానికి ఇలాంటి యువ కుర్రాళ్లతో కనుక టీమిండియా టీ20లో ఆడితే ఫలితం వేరేలా ఉండేది. ఆస్ట్రేలియా లాంటి అగ్రటీంను ఓడించిన న్యూజిలాండ్ నే వారి దేశంలో ఓడించిందంటే ఇంకా మెరుగైన ఫలితాలను కనబరిచేది. ఇదే జట్టును టీ20 వరల్డ్ కప్ కు పంపి ఉంటే బాగుండేదని అందరూ చెబుతున్నారు.

బౌలింగ్ లో సిరాజ్, చాహల్ లు బాగా చేశారు. బ్యాటింగ్ లో సూర్యకుమార్, హార్ధిక్ లు బాగా ఆడారు. హుడా బౌలింగ్ లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి తనూ ఆల్ రౌండర్ అని చాటి చెప్పాడు. ఇలా ఏరకంగా చూసినా సీనియర్ జట్టుతో పోలిస్తే ఈ జట్టు మెరుగైందని చెప్పొచ్చు. అవకాశాలు దక్కకపోవడంతో ఈ కుర్ర ఆటగాళ్లు ఇప్పుడు రెచ్చిపోయి ఆడి బలమైన న్యూజిలాండ్ నే మట్టి కరిపించారు.

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. రెండో టీ20లో టీమిండియా సూర్యకుమార్ సెంచరీ కొట్టడంతో ఘన విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్ లో మధ్యలో వర్షం కురవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం టైగా ముగిసింది. దీంతో సిరీస్ 1-0తో టీమిండియా కైవసం చేసుకుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News